నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై సందడి చేసింది. నాని కెరీర్ లోని దసరా మూవీ అతి పెద్ద సినిమాగా నిలిచింది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా.. బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది.
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషాల్లో విడుదలైంది. సమ్మర్ ని ఘనంగా ప్రారంభించిన నానిని 100 కోట్ల మార్క్ లోకి దసరా మూవీ నిలబెట్టింది. ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించారు. అలానే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. ఇప్పటికే థియేటర్లల్లో రచ్చ చేసిన ఈ మూవీ గత అర్ధరాత్రి నుంచి ఓటీటీలో కూడా సందడి చేస్తుంది.
దసరా మూవీ కోసం థియేటర్ లో సినిమా చూసిన నాని అభిమాను మాత్రమే కాదు అనివార్య కారణాల వల్ల సినిమా చూడటం మిస్సైన ప్రేక్షకులు కూడా వెయిట్ చేశారు. ఇక థియేటర్స్‌లో దుమ్మురేపిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. దసరా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సదరు సంస్థ ఇటీవల అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. అన్నట్లు గానే ఏప్రిల్ 26 బుధవారం అర్ధరాత్రి నుంచే దసరా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలా అర్ధరాత్రి నుంచి ఓటీటీలో దసరా మూవీ సందడి చేస్తోంది.
Dharani has arrived!🔥🔥🔥#Dasara is now streaming in Telugu, Tamil, Malayalam and Kannada on Netflix!#DasaraOnNetflix
— Netflix India South (@Netflix_INSouth) April 26, 2023
ఓటీటీ ప్రేక్షకలు సైతం సినిమా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే హిందీలోకి కూడా వస్తే బాగుండని కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. అలానే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు కొన్ని గంటల ముందు హీరో నాని సైతం ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. “ఈ రోజు రాత్రి నెట్ ఫ్లిక్స్ లో దసరా మూవీ. ఎట్లయితే గట్లవుతుంది. చూసుకుందాం” అంటూ ఓ వీడియో విడుదల చేశారు. థియేటర్ లో సినిమా చూడని వారంతా దసరాని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పొచ్చు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. 15 ఏళ్ల నాని కెరీర్ లో దసరా మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
TUDUM @netflix pic.twitter.com/SyFE1yP92E
— Nani (@NameisNani) April 26, 2023