సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా వచ్చిన వారసులు అతికొద్ది మందే సక్సెస్ సాధిస్తున్నారు. ఇక హీరో మాధవన్ తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటుడు. ఆయనకంటు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రొమాంటిక్ హీరో నుంచి విలక్షణ నటుడిగా టర్న్ తీసుకున్న ఆర్ మాధవన్ ఈ మద్య విలన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ మాధవన్ క్రీడలపై ఫోకస్ పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆయన ఫోకస్ పెడుతున్నది తన కోసం కాదు, తన కుమారుడి కోసం కొడుకు వేదాంత్ క్రీడల్లో బాగా రాణిస్తున్నారు. కొడుకు కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొంటున్నాడు.
మాధవన్ కుమారుడు వేదాంత్ కు చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అంటే ఆసక్తి ఉండటంతో.. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, స్విమ్మింగ్ లో రాణిస్తున్నాడు. మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఏకంగా ఏడు మెడల్స్ సాధించాడు వేదాంత్. భారత్ తరఫున ఒలింపిక్స్ 2026లో వేదాంత్ ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. ముంబైలో ఉండే పెద్ద పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ కూడా కరోనా కారణంగా మూతపడ్డాయి. దీంతో ఆలోచనలో పడ్డ మాధవన్ కొడుకు మంచి ట్రైనింగ్ ఇప్పించేందుకు బెస్ట్ స్విమ్మింగ్ పూల్‌ను ఎంచుకొన్నారు.
ఈ నేపథ్యంలో కొడుకు ట్రైనింగ్ కోసం మాధవన్, ఆయన భార్య సరితతో కలిసి దుబాయ్‌కి వెళ్లాడు మాధవన్. వేదాంత్ ట్రైనింగ్‌కి అనుకూలంగా ఉంటుందని ఇక్కడకి వచ్చాం అని తెలిపారు మాధవన్. ఈసారి ఒలింపిక్స్ లో సత్తా చాటి.. భారత్ కు పతకం సాధించాలన్న పట్టుదలతో తన తనయుడు ఉన్నాడని సంతోషాన్ని వ్యక్తం చేశారు మాధవన్.