‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో కార్తీ. తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా.. తర్వాతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవారా, నా పేరు శివ సినిమాలతో ఓ మాస్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తాను తీసిన సినిమాలను తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తెలుగులో నేరుగా ‘ఊపిరి’ సినిమా చేశారు. ఆ తర్వాత డబ్బింగ్ సినిమా ఖైదీతో తెలుగులో బ్లాక్ బాస్లర్ హిట్‌ను అందుకున్నారు. తర్వాత వచ్చిన సుల్తాన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా, సర్ధార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన రిలీజైంది.
సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు వరకు కార్తీ తెలుగులో బాగా ప్రమోషన్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సర్ధార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన ప్రతిభను బయటపెట్టారు. ప్రొఫెషనల్ సింగర్‌ను తలదన్నేలా పాట పాడారు. తెలుగులో తనకు ఎంతో ఇష్టం అయిన నాగార్జున సినిమాలోని పాట ‘‘ కన్నుల్లో నీ రూపమే..’’ పాడారు. కార్తీ సింగింగ్ లాటెంట్‌కు అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్తీ సింగింగ్ టాలెంట్‌కు నెటిజన్లు కూడా వ్వావ్ అంటున్నారు.