ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి పేరొక బ్రాండ్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో ప్రపంచదేశాల ప్రేక్షకులను ఇండియా వైపు.. ముఖ్యంగా టాలీవుడ్ వైపు తిరిగిచూసేలా చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా సరిహద్దులను చెరిపేసి.. బిగ్గెస్ట్ సినిమాలు తీయాలనే దర్శకనిర్మాతలకు కొత్త బాటలు వేశాడు. అయితే.. ఈ ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ తీసి మెప్పించిన రాజమౌళి.. తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే అనౌన్స్ చేసిన ఈ కాంబినేషన్ ‘SSMB29‘ పై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
ఈ క్రమంలో రాజమౌళి – మహేష్ బాబు కాంబో మూవీపై సోషల్ మీడియాలో రోజూ కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు తన 28వ సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. త్రివిక్రమ్ తో సినిమా తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఇదివరకు చూడని కొత్త క్యారెక్టర్ లో కనిపిస్తాడని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అదీగాక డైరెక్టర్ రాజమౌళి పై మహేష్ బాబు ఫ్యాన్స్ లో అపారమైన నమ్మకం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉండగా.. మహేష్, రాజమౌళి సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకూ మహేష్ సినిమాలో థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్ వర్త్ నటించనున్నాడని టాక్ నడిచింది. కానీ.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కార్తీ.. ఈ సినిమాలో నటించనున్నట్లు టాక్ మొదలైంది. అంతేగాక.. రాజమౌళి ఆల్రెడీ కార్తీని కలిసి విలన్ రోల్ వినిపించాడని, ఆ క్యారెక్టర్ నచ్చి కార్తీ కూడా రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో రాజమౌళి, మహేష్ ఫ్యాన్స్ చాలా ఎక్సయిట్ అవుతున్నారు. ఒకవేళ ఇదేగనక నిజమైతే.. సినిమాలో మహేష్, కార్తీల పోరు భీభత్సం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో!
BIG BREAKING#SSRajamouli to approach Kollywood Star #Karthi to play one of the two antagonists in #SSMB29 against #MaheshBabu , it’s expected that Karthi is impressed with the role and also excited to join hands with India’s biggest director pic.twitter.com/u5gU7r3nGA
— Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff) October 13, 2022