తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గౌరవ మర్యాదలు, ఆ హీరోలకు ఉన్న క్రేజ్.. ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు సినిమాలతో పాటు కుటుంబానికి, బంధాలకు ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అలాగే నందమూరి నటవారసుల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ కూడా బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి రుజువైంది. ఆయన హీరో గా నటిస్తున్న చిత్రం “బింబిసార”. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ చేతికి వేయించుకున్న పచ్చబొట్టు కెమెరా కంటపడింది. దీంతో దీనిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.
కళ్యామ్ రామ్ హీరోగా నటిస్తున్న”బింబిసార” ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ఈక్రమంలో కళ్యాణ్ రామ్ చేతిపై స్వాతి అనే పేరు పచ్చబొట్టుగా కనిపించింది. కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి. ఆమె పేరును కళ్యాణ్ రామ్ పచ్చబొట్టు వేయించుకున్నారు. చాలా సంవత్సరాల క్రితమే కళ్యాణ్ రామ్ ఈ పచ్చబొట్టు వేయించుకున్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనితో పాటు కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్, కూతురు తారక అద్విత. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ పిక్ కూడా నెటిజెన్లను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ భార్య స్వాతి వృత్తిరిత్యా డాక్టర్. 2006 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన కళ్యాణ్ రామ్, స్వాతిల వివాహం జరిగింది.
భార్య స్వాతి అంటే కళ్యాణ్ రామ్ కు ఎంతో ఇష్టం కావడంతో ఆమె పేరును పచ్చబొట్టు వేయించుకున్నారట. స్వాతి తమ్ముడి పేరు హరి..కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించి మొదటి క్రిటిక్ ఆయనే అని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రయోగాత్మక సినిమాలలో కళ్యాణ్ రామ్ ఎక్కువగా నటించగా ఈ సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలవడం గమనార్హం.
తాజాగా “బింబిసార” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రామ్ రెడీ అయ్యాడు. ఇప్పటికే బింబిసార ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ పక్కా అనే అభిప్రాయాలు క్రియేట్ చేసింది. మరి.. భార్య పేరు కళ్యాణ్ రామ్ పచ్చబొట్టుగా వేయించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.