ఈ మధ్య కాలంలో పలువురు హీరో, హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ పూర్ణ, దుబాయ్ లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంది. ఇక తాజాగా జెర్సీ ఫేమ్ నటుడు, యువ హీరో హరీశ్ కల్యాణ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇండస్ట్రీలోని మిగతా హీరోహీరోయిన్లు.. ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగు యాక్టర్స్ కూడా మనోడికి విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ యువహీరోల్లో హరీశ్ కల్యాణ్ ఒకడు. తమిళ ‘బిగ్ బాస్’ తొలి సీజన్ తో ప్రేక్షకులకు పరిచయమైన ఇతడు.. ‘సింధు సమవేలి’చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇందులో యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘ప్యార్ ప్రేమ కాదల్’, ‘ఇస్పడే రాజవుం ఇదయ రాణియుం’ చిత్రాలు హరీశ్ కు చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో తీసిన ‘కాదలి’లో హరీశ్ హీరోగా నటించాడు. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’లో యంగ్ నాని లుక్ లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్, డీజిల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో అవి విడుదల కానున్నాయి.
కొన్నాళ్ల ముందు నర్మదా ఉదయ్ కుమార్ తో తనకు ఎంగేజ్ మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. తాజాగా శుక్రవారం ఆమెతో.. చెన్నైలోని తిరువెర్కడు జీపీఎన్ ప్యాలెస్ లో ఉదయం ఏడడుగులు వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. అంతకు ముందు తనది ప్రేమ పెళ్లి అనే వార్తలని కొట్టిపారేశాడు. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. ఇక నర్మదా విషయానికొస్తే.. ఆమెకి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. చెన్నైకి చెందిన యువ పారిశ్రామికవేత్త అయిన నర్మదా.. ‘క్లిక్ డిజైన్స్’, ‘దిస్ ఈజ్ హెర్’ రెండు సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తోంది.
..And they are Mr & Mrs !
handsome groom @iamharishkalyan with
his beautiful bride #NarmadaUdayakumar at the sacred wedding ceremony..Here are pics of the duo’s special moments !
Best wishes to the Beautiful couple!💐@DoneChannel1 #HarishKalyanWedding #HarishKalyan pic.twitter.com/34ytmxnkpy
— Rinku Gupta (@RinkuGupta2012) October 28, 2022
@iamharishkalyan got hitched to #Narmada wishes to the couple 💟💕#HarishKalyan #HarishWedsNarmada #HarishWedsNarmada #HarishNarmada pic.twitter.com/3lCl5QW2E8
— Cine Max (@mdnews_tamil) October 28, 2022
Happy Harish ‘Kalyan’am! 😎🍻congratulations both of you! @iamharishkalyan pic.twitter.com/0e2AfVO65C
— Ashok Selvan (@AshokSelvan) October 28, 2022