Dhanush: స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో ధనుష్. కెరీర్ మొదట్లో తన నటన కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తర్వాత సినిమాకు, సినిమాకు నటనను మెరుగుపర్చుకుంటూ నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకునే స్థాయికి ఎదిగారు. బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ముందుకు దూసుకుపోతున్నారు. అలాంటి ఆయన్ను ఓ వివాదం గత కొన్నేళ్లనుంచి నీడలా వెంటాడుతోంది. మధురైకు చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకే అంటూ గతేడాది నవంబర్‌లో మద్రాస్ హై కోర్టును ఆశ్రయించటంతో ఈ వివాదం మొదలైంది.
అతడు తమ మూడో కుమారుడని, సినిమాల్లో నటించాలని ఉండటంతో ఇంటి నుంచి పారిపోయాడని ఆ దంపతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము వృద్ధ్యాప్యంలో జీవించటానికి ఎలాంటి ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని, ధనుష్ తమ ఖర్చుల కోసం నెలకు రూ. 65వేలు ఇవ్వాలని కోరారు. అయితే, ఆ భార్యా భర్తలు చెప్పిన దాంతో ధనుష్ ఏకభవించటం లేదు. తాను తమిళ దర్శకుడు కస్తూరి రాజా, విజయలక్ష్మీల సంతానమేనని కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో కోర్టు డీఎన్‌ఏ టెస్టు చేయించాల్సిందిగా సూచించింది. కానీ, ధనుష్ మాత్రం డీఎన్‌ఏ టెస్టు కోసం ముందుకు రావటం లేదు.
దీనికి బదులు ఆయన తన జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో కోర్టు వారి పిటీషన్ కొట్టివేసింది. అయినప్పటికి మధురై దంపతులు తమ వాదనలను ఆపటం లేదు. దీంతో ధనుష్ మధురై దంపతులకు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేస్తున్న అసత్య ఆరోపణలు ఆపకపోతే.. పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నాడు. చేసిన తప్పు ఒప్పుకోవాలన్నారు. మీడియా ముందుకు వచ్చి.. తాము చేసిన ఆరోపణలన్నీ ఆసత్యాలేనని దంపతులిద్దరూ చెప్పాలని కోరారు. మరి, మధురై దంపతులపై ధనుష్ పరువు నష్టం దావాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Malavika Mohanan: హీరోయిన్ ట్వీట్‌కు ఎంపీ రిప్లై.. మండిపడుతున్న నెటిజన్లు..