తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మరపురాని చిత్రాలు వచ్చాయి. కానీ అందులో గొప్ప చిత్రం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతదేశ చిత్రపరిశ్రమలోనే ఓ మైలురాయిగా నిలిచింది. అప్పట్లోనే ఎవ్వరూ ఊహించని రీతిలో గ్రాఫిక్స్ చేసి సింగీతం శ్రీనివాసరావు అబ్బురపరిచారు. అయితే గత కొంతకాలం ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అటు బాలయ్య సైతం తన టాక్ షో అన్ స్టాపబుల్ లో సైతం.. ఆదిత్య 369 మూవీకి సిక్వెల్ అయిన ఆదిత్య 999 సినిమా కచ్చితంగా ఉంటుంది అని పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో విశ్వక్ సేన్ స్వియ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దమ్కీ’ ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బాలయ్య ఆదిత్య 999పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
అది 1991.. యవత్ భారతదేశం మెుత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపే చూసింది. దానికి కారణం బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం వేచి చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర దించుతూ.. బాలయ్య సీక్వెల్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజుల క్రితమే అన్ స్టాపబుల్ షోలో ఆదిత్య 999 సినిమా ఉంటుందని, దాంట్లో తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ కూడా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు.
#Aditya999 #Aditya369 #NBK pic.twitter.com/Tkq7upUVkE
— Aakashavaani (@TheAakashavaani) November 18, 2022
ఈక్రమంలోనే తాజాగా హీరో విశ్వక్ సేన్ దమ్కీ మూవీ ట్రైలర్ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాలయ్య. ఈ వేడుకలో తెలంగాణ యాసలో మాట్లాడి అభిమానుల చేత అరుపులు పెట్టించాడు బాలయ్య. దమ్కీ సినిమాలోని డైలాగ్స్ చెబుతూ రచ్చ రచ్చ లేపాడు బాలకృష్ణ. ఇక ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ ఎప్పుడు అని అభిమానులు ప్రశ్నించగా.. ఆదిత్య 999 మూవీతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. వచ్చే సంవత్సరమే ఈ సినిమా ఉంటుందని, అదీ కాక ఈ సినిమా కథను తానే రాసుకుంటున్నట్లు తెలిపాడు. ఆదిత్య 999 సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు బాలయ్య తెలిపాడు. దాంతో ఈ వార్త తెలిసిన బాలయ్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.