ఈ మధ్య సెలబ్రిటీలు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. అలా అని ఆ విషయాన్ని ఏం దాచుకోవట్లేదు. ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ సమంత, మయసైటిస్ తో బాధపడుతున్నానని చెప్పింది. ఇక స్టార్ హీరో వరుణ్ ధావన్.. ‘వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్’ అనే వ్యాధితో సతమతమవుతున్నానని చెప్పాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని రివీల్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. తెగ కంగారుపడిపోతున్నారు. త్వరగా తగ్గాలని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురానా.. ‘విక్కీ డోనర్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. వీటిలో బాలా, బదాయి హో, డాక్టర్ జీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘ఆన్ యాక్షన్ హీరో’ అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కాంక్లేవ్ కి అటెండ్ అయిన ఆయుష్మాన్.. తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి బయటపెట్టాడు. గత ఆరేళ్ల నుంచి వెర్టిగో(తీవ్రమైన తలనొప్పి) సమస్యతో బాధపడుతున్నానని అన్నాడు. సినిమాల్లో కొన్ని సీన్స్ తీసేటప్పుడు ఈ సమస్య వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశానని చెప్పాడు.
‘ఆరేళ్లుగా వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. నా కొత్త మూవీలో ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకే సీన్ ఉంటుంది. సేఫ్టీ కోసం హార్నెస్ కేబుల్స్ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని చాలా భయపడిపోయాను. ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసింది’ అని ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా వెర్టిగో వ్యాధితో బాధపడుతున్న వారు.. రంగులరాట్నం పై తిప్పితిప్పి అక్కడ నుంచి విసిరేసినట్లుగా ఉంటుంది. ఎప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. పరిసరాలు తిరుగుతున్న ఫీలింగ్, బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనిపిస్తుంది. వికారం, వాంతులు కూడా వస్తాయి. పరిస్థితి నార్మల్ గా ఉన్నాసరే చెమట ఎక్కువగా పడుతుంది. మరి ప్రముఖ హీరో ఆయుష్మాన్ కు… ఈ వ్యాధి రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.