స్టార్ హీరో అజిత్‌కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లు లేని సమయంలో ఆయన ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. బైకుపై ప్రపంచ టూరుకు కూడా వెళుతూ ఉంటారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు తమిళనాట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ‘తల’ అని ముద్దుగా పిలుచుకునే ఈయనకు సినిమాలతో పాటు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లు లేని సమయంలో ఆయన బైక్ రైడ్లకు వెళుతూ ఉంటారు. లాంగ్ డ్రైవ్‌లు చేస్తూ గడుపుతూ ఉంటారు. కొన్ని సార్లు బైక్ మీద ప్రపంచ టూరుకు వెళుతూ ఉంటారు. గతంలో ఆయన ఓ టూర్‌లో ఉండగా జరిగిన ఓ సంఘటన తాలూకా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అజిత్ తన ఫ్యాన్ ప్రాణాలు కాపాడిన ఆ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. గతంలో ఆయన బైక్ టూర్‌లో ఉండగా.. ఓ ఫ్యాన్ ఆయన వెంట బైక్ టూర్ చేయటం మొదలుపెట్టాడు. అజిత్ బైకును ఫాలో అవుతూ ఉన్నాడు. అజిత్ తన వెనకాల ఫాలో అవుతూ వస్తున్న ఫ్యాన్ బైకును చూశారు. ఓ చోట అజిత్ బైకు ఓ ఆటో వెనక్కు వెళ్లింది. ఆటో ముందుగా ఓ పెద్ద లారీ వస్తూ ఉంది. లారీ కారణంగా ఫ్యాన్ ఇబ్బందిలో పడతాడని భావించిన ఆయన తన చేత్తో లారీ వస్తోంది అన్నట్లు ఓ చేతితో సంజ్ఞ చేశారు. అది చూసిన ఫ్యాన్ వెంటనే పక్కకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్యాన్ అజిత్‌తో ఫొటో దిగాడు.
ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. కాగా, హీరో అజిత్ నటించిన తాజా చిత్రం ‘తునివు’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన ‘విడ ముయర్చి’ అనే తమిళ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. మగిల్ తిరుమేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. మరి, స్టార్ హీరో అజిత్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Thala ALWAYS GREAT HUMAN BEING
😍🙏❤️AK sir Protect a fan who is about to have an accident.😍🙏 #Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/NR0cwSg1lp
— Silambarasan TR (@SilambarsanTR) May 3, 2023