పాయల్ రాజ్ పుత్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. RX100 మూవీతో టాలీవుడ్ పరిచయమైన ఈ భామ.. తన మొదటి సినిమాతోనే అందాల విందు చేసింది. రొమాన్స్ పండిచంటంలోఈ బ్యూటీ తరువాతనే ఎవరైనా. తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ కి నిత్యం టచ్ లోఉంటుంది. ప్రస్తుతం ఆది సాయికుమార్ కు జోడిగా ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిని టీజర్ విడుదలైంది. ఇందులో పాయల్ ఓ రేంజ్ లో అందాల విందు చేసింది.
ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఈ చిత్రాన్ని కళ్యాన్జి గోగన తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆది సాయికుమార్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. సిటీలో జరుగుతున్న కిడ్నాప్ ల మిస్టరీ ఏంటనేది టీజర్ లో ఉత్కంఠంగా చూపించారు. ఆది సాయి కుమార్ కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి హిట్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాతే ఆదికి సరైన హిట్ పడలేదు. ఈ సినిమాతో ఆది తిరిగి ఫామ్ లోకి వస్తాడని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇక ఆది, పాయల్ రాజ్ పుత్ మధ్య రొమాన్స్ డోస్ బాగానే ఉన్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. పాయల్ రాజ్ పుత్ తడి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఇలాంటి బోల్డ్ సీన్స్ పాయల్ కి కొత్తేమి కాదు. హాట్ గ్లామర్ తోనే పాయల్ రాజ్ పుత్ యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ‘తీస్ మార్ ఖాన్’ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.