Hebah Patel: కుమారి 21F సినిమాతో కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టిన హెబ్బా పటేల్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేకపోయినా..
‘కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. స్టైలిష్ లుక్స్‌తో, అమాయకపు పిల్ల యాక్టింగ్‌తో కుమారి 21ఎఫ్ సినిమాలో మెప్పించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసిన హెబ్బా.. పెద్దగా సక్సెస్‌ను అందుకోలేకపోయింది. దీంతో.. ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది హెబ్బా. అడపా దడపా సినిమాలు చేస్తున్నా.. ఆమెకు అవకాశాలు లేవనే చెప్పాలి. అయినా కూడా కుమారి 21 ఎఫ్ బ్యూటీగా తెలుగు సినిమా ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.
తెలుగులో కుమరి 21 ఎఫ్‌తో పాటు అంధగాడు, నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్, ఏంజిల్, 24 కిస్సెస్, మిస్టర్, ఒరేయ్ బుజ్జిగా, ఒదేల రైల్వేస్టేషన్ సినిమాల్లో నటించింది. అయితే.. తాజాగా హెబ్బా పటేల్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెబ్బా పటేల్ ముస్లిం అనే విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ఆమె బురఖా ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసింది. దీంతో చాలా మంది నెటిజన్లు.. ఇంతకు హెబ్బా పటేల్ మతం ఏంటని గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. హెబ్బా ముస్లిమే. కన్నడ మాట్లాడే ముస్లిం. కానీ.. ఆమె పేరులో పటేల్ ఉండటంతో చాలా మంది ఆమె గుజరాతీ హిందువుని అనుకుంటూ ఉంటారు. మరి హెబ్బా సినిమాలతో పాటు ఈ ఇంట్రస్టింగ్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This Song Is One Of Unforgettable Memory In My Life 💫😍🤍@ThisIsDSP+Lyricst+Singer 🙌🏻🎧❤️#RajTharun #HebahPatel #Kumari21F pic.twitter.com/3XOBY1PghR
— జల్సా🚶🏻♂️🇦🇷 سائی (@Jalsa_Sai44) January 6, 2023