ప్రముఖ మలయాళ హీరో.. భాగమతి ఫేమ్ ఉన్నిముకుందన్ పై 2018లో లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను ఉన్ని ముకుందన్ లైంగికంగా వేధించాడని, కొట్టాయం టౌన్‌కు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. స్టోరీ చర్చల కోసం తనను పిలిపించి వేధించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 2018 సెప్టెంబర్ 15న పోలీసులు ఉన్నిపై కేసు నమోదు చేశారు. తర్వాత అతడ్ని కోర్టులో కూడా హాజరు పరిచారు. ప్రముఖ న్యాయవాది సైబీ జోస్ కిడంగూర్ ఉన్ని తరపున కేసును వాదించారు. యువతితో రాజీ చేసుకున్నట్లు కోర్టుకు ఓ పత్రం చూపించారు.
దీంతో కోర్టు కేసును కొట్టేసింది. ఇక అప్పటినుంచి ఉన్ని స్టే ఆర్డర్ పై ఉంటున్నారు. అయితే, జోస్ కిడంగూర్ కోర్టుకు చూపించిన పత్రంపై తాను సంతకం చేయలేదని సదరు బాధిత యువతి తాజాగా, కేరళ హైకోర్టు వాగ్మూలం ఇచ్చింది. దీంతో కోర్టు సైబీ జోస్ కిడంగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన తప్పుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నిపై ఉన్న స్టే ఆర్డర్‌ను విత్ డ్రా చేసుకుంది. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. కాగా, ఉన్నిముకుందన్ 2011లో వచ్చిన ‘‘బాంబే మార్చ్ 12’’ అన్న మలయాళ సినిమాతో సినీ రంగ ప్రేవేశం చేశారు. అదే సంవత్సరం తమిళంలో సీడన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత అనుష్క హీరోయిన్‌గా తెరకెక్కిన ‘భాగమతి’ సినిమాలో మేల్ లీడ్ రోల్ చేశారు. ఖిలాడీ, యశోధ సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీబిజీగడుపుతున్నారు. మరి, ఉన్నిపై ఉన్న స్టేను కోర్టు తీసేయటం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.