డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్టర్ ప్లాన్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. పవన్ కల్యాణ్, రవితేజ సినిమాలకు సంబంధించి ఒకేసారి అప్డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు చెప్పగానే ‘గబ్బర్ సింగ్’ సినిమానే గుర్తొస్తుంది. తీసింది రీమేక్ అయినా సరే ఎక్కడా అలాంటి ఫీల్
రాకుండా అదరగొట్టాడు. దీంతో అప్పటినుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్.. అలాంటి మరో మూవీ కావాలని అడుగుతూ వచ్చారు. అభిమానుల కోరిక నిజంగానే ఫలించింది. చాన్నాళ్ల క్రితమే అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దానితో పాటు మరో ఆసక్తికర విషయాన్ని హరీష్ శంకర్ బయటపెట్టారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీగా మారిపోయారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ తీరిక లేకుండా ఉన్నారు. దీంతో సినిమాలన్నీ కూడా మెల్లగా షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం(ఏప్రిల్ 5) నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ షురూ అయిందని హరీష్ ట్వీట్ చేశారు. ఇందులో పవన్.. కాలేజీ లెక్చరర్ గా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకునే దానిబట్టి.. ఈ మూవీ రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది.
మరోవైపు తన తర్వాతి సినిమాపై కూడా హరీష్ శంకర్ హింట్ ఇచ్చేశారు. ‘రావణాసుర’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రవితేజ.. ‘ఆస్క్ రావణాసుర’ పేరుతో అభిమానులతో చాట్ చేశారు. ఇందులో ఓ నెటిజన్స్ అడిగిన బదులిస్తూ రవితేజ.. హరీష్ శంకర్ ట్యాగ్ చేశారు. దీంతో ఈ డైరెక్టర్ ఓపెన్ అయిపోయారు. రవితేజ కోసం ఓ పీరియాడిక్ డ్రామా స్టోరీ రాస్తున్నట్లు రివీల్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్.. పవన్ తో సినిమా పూర్తవగానే రవితేజతో మూవీ ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. మరి హరీష్ శంకర్.. క్రేజీ అప్డేట్స్ వరసగా ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023
Ha ha ha ha ha
Annaya tho always ready in fact working on a period drama …. Very Soon We r going to repeat history … thank you annayya @RaviTeja_offl 🤗🤗🤗🤗 https://t.co/5pppddUzJP— Harish Shankar .S (@harish2you) April 4, 2023