సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కోవిడ్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఓవైపు ఫ్యామిలీతో గడుపుతూనే మరోవైపు ప్రొఫెషనల్ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఖాళీ దొరికితే సోషల్ మీడియాలో వీడియోలు, చిట్ చాట్‌లతో కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ అనంతరం సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్, బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంలతో దగ్గరైన యాక్టర్ కం యాంకర్ హరితేజ. ఇటీవల టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ‘ఇంకేంటి డోలో? సారీ బోలో’ అంటూ చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్ల కామెంట్లకు గట్టిగానే కౌంటర్లు వేసే ప్రయత్నం చేసింది హరితేజ.ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘నీకు కరోనా పాజిటివ్ రావాలి’ అన్నాడు. దానికి హరితేజ స్పందించి.. ”మీకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి.. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’ అని రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్.. ‘నువ్వూ నీ ఎదవ ఓవర్ యాక్టింగ్.. ఇంత సీరియస్ సిచ్యుయేషన్‌లో కూడా నీ పిచ్చి సిల్లీ జోక్స్.. థూ’ అని ఘాటుగా కామెంట్ చేశాడు. దానికి స్పందిస్తూ.. ‘అబ్బో.. మస్త్ బీపీ వొస్తాందా సార్ మీకు.. సల్ల పడండి జర.. నవ్వుకుంటే అన్ని బాధలు పోతయ్ అని నేను నమ్ముతాను. డోంట్ బి సో రూడ్’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం నెటిజన్లతో హరితేజ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. హరితేజ చివరిగా అల్లుడు అదుర్స్, జాంబిరెడ్డి సినిమాల్లో కనిపించింది. మరి నెటిజన్లతో హరితేజ చేసిన సంభాషణ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.