ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో చైల్డ్‌హుడ్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. చాలా మంది గుర్తు పట్టలేకుండా మారిపోయారు. ఈ ట్రెండ్‌లో భాగంగా ప్రస్తుతం ఓ టాప్ హీరోయిన్ చిన్న నాటి ఫోటో నెట్టింట వైరలవుతోంది. మరి ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..
బాలనటిగా సినిమాల్లో కనిపించి అలరించింది. క్యూట్ లుక్‌తో అందరిని ఆకట్టుకుంది. ఇలాంటి చిచ్చర పిడుగు మన ఇంట్లో కూడా ఉండే బాగుండు అనిపించేలా అందరి మనసు దోచింది. మరీ ముఖ్యంగా హృతిక్ రోషన్ కోయి మిల్ గయా చిత్రంలో తన క్యూట్ యాక్టింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత షకలక భూం భూం రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కశ్మీర్ యాపిల్‌లా ఉన్న ఆ బ్యూటీ అందానికి కుర్రకారు దాసోహం అన్నది. ఆ తర్వాత సుమారు 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలింది. అయితే ఆమె హీరోయిన్ ఎంట్రీపై పలు విమర్శలు వచ్చాయి. ఆమె తల్లిని జనాలు ఆడిపోసుకున్నారు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. లేదా.. అయితే చదవండి..
దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ పక్కన.. కశ్మీర్ యాపిల్‌లా ఉన్న హన్సికను చూసి కుర్రకారు గుండె బేజారు అయ్యింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత హన్సిక వెను తిరిగి చూసుకోలేదు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఏ రేంజ్‌లో అభిమానం సంపాదించుకుంది అంటే.. ఫ్యాన్స్ ఏకంగా హన్సికకు గుడి కట్టేశారు. సుమారు 15 ఏళ్ల పాటు హీరోయిన్‌గా రాణించింది. ఇక కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టింది హన్సిక.
అయితే హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న రెండు మూడేళ్ల తర్వాత వెంటనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దేశముదురు సినిమాలో నటించేటప్పుడు హన్సిక వయసు 15 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ సినిమాలో 18 ఏళ్ల అమ్మాయిలా కనిపించింది హన్సిక. దాంతో చాలా మంది.. హన్సికకు హర్మొనల్ ఇంజెక్షన్స్ వాడారు.. అందుకే ఇంత చిన్న వయసులోనే ఎంతో పెద్దగా కనిపిస్తుంది అనే విమర్శలు వచ్చాయి. అంతేకాక సినిమా అవకాశాల కోసం హన్సిక తల్లే.. ఆమెకు హర్మోనల్ ఇంజెక్షన్లు వాడింది అనే ఆరోపణలు సైతం వెలుగు చూశాయి.
ఇక తాజాగా కొన్ని రోజుల క్రితం ఈ ఆరోపణలపై హన్సిక, ఆమె తల్లి స్పందించారు. హన్సికాస్ లవ్ షాది వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హన్సిక దీనిపై స్పందించారు. ‘‘సెలబ్రిటీగా ఉన్నందుకు మేం చెల్లించే మూల్యం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం. ఎంత చండాలంగా రాస్తారో. నన్ను మహిళగా మార్చడం కోసం మా అమ్మ హర్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. నేను ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే.. ఇప్పుడు కూడా వాడతాను కదా. ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారో అర్థం కావడం లేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హన్సిక.
ఇక ఈ ఆరోపణలపై హన్సిక తల్లి స్పందిస్తూ.. ‘‘ఈ ఆరోపణలు నిజమైతే.. నేను టాటా, బిర్లా, ఇతర మిలియనీర్ల జాబితాలో ఉండేదాన్ని. ఇలాంటి వార్తలు రాసే వారికి బుర్ర ఉంటుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. మేం పంజాబీలం. మా పిల్లలు 12-16 ఏళ్ల మధ్యే ఎదుగుతారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.