ఆ భామ టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా చేసింది. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమెనే హన్సిక. గతంలో ఓ హీరోతో ప్రేమలో పడి, విడిపోయిన ఈ బ్యూటీ.. మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అయిందని కొన్నాళ్ల నుంచి న్యూస్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది. కాకపోతే పెళ్లికొడుకు ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు అది కూడా బయటపడిపోయింది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీనేజ్ లో హీరోయిన్ అయిపోయిన హన్సిక మోత్వానీ ‘దేశముదురు’ మూవీతో హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించింది. తాజాగా ఆమె పెళ్లి తేదీతో పాటు వరుడు వివరాలు బయటకొచ్చాయి. తన బిజినెస్ పార్ట్ నర్ నే.. లైఫ్ పార్ట్ నర్ ని చేసుకోనుందని తెలుస్తోంది. హన్సిక పెళ్లి.. డిసెంబరు 4న హన్సిక పెళ్లి జరగనుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త సొహైల్ కతురియాతో ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో హన్సిక-సొహైల్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే వీరి ఆలోచనలతో పాటు అభిరుచులు కలిశాయట. అప్పటి నుంచి ప్రేమ మొదలైందని, తాజాగా పెళ్లి చేసుకోనున్నారనే విషయం బయటకొచ్చింది.
రాజస్థాన్ జైపుర్ లోని 450 ఏళ్ల నాటి ‘ముందోతా ఫోర్ట్ ప్యాలెస్’ లో ఈ పెళ్లి గ్రాండ్ గా జరగనుంది. డిసెంబరు 2 నుంచి 4వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే దీనికి హాజరు కానున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కోసం పోలో మ్యాచ్, క్యాసినో థీమ్ తో విందు భోజనం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హన్సిక చేతిలో ‘పార్ట్ నర్’, ‘105 మినిట్స్’ సినిమాలున్నాయి. త్వరలో ఇవి విడుదల కానున్నాయి. ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే తెలుగు సినిమా షూటింగ్ దశలో ఉంది. మరి హన్సిక పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.