ఈ ఫొటోల్లో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్. ఆమె గతంలో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆమెకు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అన్న పేరు ఉంది.
సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోతే నెగ్గుకు రావటం చాలా కష్టం. ఎందుకంటే.. అంతా బానే ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. అయితే, హీరోయిన్ల విషయంలో ఎక్కువ ప్లాపులు ఉంటే గనుక వారిపై ఐరన్ లెగ్ అని ముద్ర వేసి.. ఛాన్సులు రాకుండా చేసేస్తారు. ఐరన్ లెగ్‌గా ముద్ర పడి సినిమాలకు దూరమైన నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ, నటీమణులు నటించిన ప్రతీ సినిమా హిట్టయి.. గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
అలాంటి వారిలో పై ఫొటోల్లో కనిపిస్తున్న చిన్నారి టాప్‌లో ఉంటుంది. ఆమె తెలుగులో కీలక పాత్రల్లో నటించిన, హీరోయిన్‌గా చేసిన సినిమాలన్నీ అద్భుత విజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఇంకెవరో కాదు.. చేప కళ్ల భామ సంయుక్త మీనన్. ఆమె 2016లో వచ్చిన మలయాళ సినిమా ‘పాప్‌కార్న్’తో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఇచ్చారు. మొదటి సినిమాలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించారు.
2022లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్ర చేశారు. తర్వాత ఆమె హీరోయిన్‌గా నటించిన బింబిసార కూడా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2023లో వచ్చిన బైలింగువల్ మూవీ సార్, విరూపాక్ష సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక, విరూపాక్ష సినిమాలో నటనకు గాను ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సంయుక్త ప్రస్తుతం పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల బ్రో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. డెవిల్ అనే మరో సినిమాలోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.