గత సినిమాల్లో విలన్ అనగానే ఓ భయంకర రూపం కనబడాల్సిందే. తెరపై నానా భీభత్సం సృష్టించాల్సిందే. దీంతో వారంటే ఓ రకమైన భయం ఏర్పడేది. సినిమాలో మాదిరిగానే బయట కూడా ఉంటామేమోనని, తమను చూడంగానే దూరంగా పారిపోయే వారని విలన్లుగా చేసిన నటీనటులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరోలే కాదూ.. విలన్లూ కూడా స్మార్ట్ గా ఉంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. హీరోల కన్నా వాళ్లకే క్రేజ్ వస్తుంది ఇప్పుడు. అలాంటి నటుల్లో ఒకరే ఇప్పుడు మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు.
ఈ ఫోటోలో చేతులు కట్టుకుని కనిపిస్తున్న హీరో కమ్ విలన్ ఎవరో తెలుసా. పూల షర్ట్ వేసుకుని, చేతులు కట్టుకుని, నవ్వును ఆపుకుంటూ భలే ఫన్నీగా ఉన్నాడు కదా. కాస్తా జాగ్రత్త చూడండి గుర్తు పట్టగలరేమో. . క్లూ ఇవ్వమంటారా.. అతడు ఇటీవల కాలంలో ఓ టాప్ హీరోయిన్ సినిమలో విలన్‌గా నటించాడు. ఏంటీ గుర్తుకు రావడం లేదా అయితే చెప్పేస్తాలేండి.. అతడే ఉన్ని ముకుందన్. ఎవరూ అని తలలు పట్టుకుంటున్నారా. అదేనండి యశోద మూవీలో డాక్టర్ కమ్ విలన్‌గా నటించాడు కదా అతడే ఇతడూ. అతడి పూర్తి పేరు ఉన్నికృష్ణన్ ముకుందన్. మలయాళ నటుడు. మాలీవుడ్ సినిమాల్లో కథానాయకుడు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. యశోదలో విలన్ పాత్రతో మెస్మరైజ్ చేశాడు. కేరళ పుట్టినప్పటికీ ఆయన గుజరాత్ లో పెరిగాడు. విద్యాభ్యాసం అంతా అహ్మదాబాద్ , కేరళలో జరిగింది.
కేరళలో పుట్టినప్పటికీ.. ఆయన సినిమా జీవితం మాత్రం తమిళంలో మొదలైంది. ఆ తర్వాతే మాలీవుడ్ కు పరిచమయ్యాడు. 2016లో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. జనతా గ్యారేజ్ సినిమాలో జూ. ఎన్టీఆర్ కు సోదరుడిగా నటించారు. అందులో నెగిటివ్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అనుష్క నటించిన భాగమతి, రవితేజ ఖిలాడీలో ప్రత్యేక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న యశోద మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. చివరి వరకు అతడూ విలన్ అని తెలిసే సరికి ప్రేక్షకులంతా షాక్ గురౌతారు. ఇటీవలే మాలికాపురం అంటూ ఓ డివోషనల్ మూవీతో వచ్చారు. పలు మలయాళ డబ్బింగ్ సినిమాతోనూ తెలుగులో కనిపించారు. హ్యాండ్సమ్ లుక్ లో కనిపించే ఈ కుర్రాడు స్టిల్ బ్యాచ్‌లర్. ఉన్ని ముకుందన్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా గురించి కామెంట్ల రూపంలో తెలియజేయండి.