ఈ నటిని గుర్తు పట్టారా..? తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది

సావిత్రి, శారద, భానుమతి, దేవిక, జానకి, కృష్ణకుమారి, సూర్యకాంతం, కన్నాంబ వంటి వారు తెలుగు నేలపై పుట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో రారాణులుగా ఎదిగారు. ఇప్పుడంటే మాలీవుడ్ నుండి హీరోయిన్స్ తెచ్చుకుంటున్నాం కానీ.. కేరళలో పుట్టి.. తెలుగు తెరను ఏలిన ఓ అగ్రతార ఎవరో తెలుసా..?

ఇప్పడంటే తెలుగు హీరోయిన్స్ సినిమాల్లో కనిపించడం అరుదుగా కనిపిస్తుంది.. కానీ సావిత్రి, శారద, భానుమతి, దేవిక, జానకి, కృష్ణకుమారి, సూర్యకాంతం, కన్నాంబ వంటి వారు తెలుగు నేలపై పుట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో రారాణులుగా ఎదిగారు. ఆ తర్వాత తరం విజయ నిర్మల, జయసుధ, జయప్రద నుండి అనేక  మంది తారామణులు తమ సత్తాను చాటారు. బాలీవుడ్‌కు ఎగుమతి కూడా అయ్యారు. అయితే తర్వాత కాలంలో తెలుగు హీరోయిన్ల హవా తగ్గిపోయి బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా మన దర్శకుల కన్ను మలయాళ బ్యూటీస్, కన్నడ కస్తూరీలపై పడింది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మాలీవుడ్ నుండి అనేక మంది హీరోయిన్లు వస్తున్నారు కానీ.. ఒకప్పుడు మలయాళ పరిశ్రమ నుండి తెలుగు తెరకు ఉవ్వెత్తున్న ఎగసిపడిందో అందం. ఆమె అందానికే కాదూ నటనకు, డ్యాన్సులకు ఫిదా అయ్యారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గురించే ఇప్పడు మనం మాట్లాడుకుంటుందన్నదీ. ఇప్పడు  హీరోయిన్లు బాగా నటించారని, సాయి పల్లవి చేస్తున్న డాన్సులు గురించి అహో, ఓహో అంటున్నాం కానీ ఆమె వెండి తెరను తన డ్యాన్సులతో హోరెత్తించింది. కేవలం అప్పట్లో స్పెషల్ సాంగ్స్ కు జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ వంటి నటులున్నా…ఈమె డ్యాన్సు చూస్తే కన్నుల పండుగగా అనిపించేంది. ఆమె మరెవరో కాదూ సోగకళ్ల చిన్నది రాధ. మలయాళ కుటుంబలో 1965, జూన్ 3న జన్మించింది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఆమె అసలు పేరు ఉదయ చంద్రిక. ఆమె భారతీరాజా తమిళంలో తెరకెక్కించిన అలైగల్ ఓవాతిల్లై (తెలుగులో సీతాకోకచిలుక) సినిమాలో నటించింది. ఆ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. తమిళంలో చేస్తూ తెలుగులోకి అడుగుపెపట్టింది. ఆ తర్వాత ప్రేమమూర్తులు అనే చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించింది. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కనిపించింది.1980 నుండి ఒక దశకంలో అగ్రతారగా వెలుగొంది. అయితే తెలుగులో బెస్ట్ జోడి అనగానే గుర్తుకు వచ్చే జంటగా చిరంజీవి-రాధగా గుర్తుండిపోతారు.

తెలుగు సినిమా తెరను తమ డ్యాన్సులతో ఓ ఊపు ఊపేశారు వీరిద్దరూ. క్లాస్, మాస్ ఏ పాటకైనా స్టప్ ఇరగదీసేవారు. వీరిద్దరూ సినిమాలో కనిపిస్తున్నారంటే.. థియేటర్లకు పండుగే. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు కనక వర్షం కురిపించేవి. చిరంజీవి, రాధ కాంబోలో సుమారు 14 చిత్రాలు వచ్చాయి. డ్యాన్సుల విషయంలో చిరంజీవికి గట్టిపోటీనిచ్చేది రాధ. కొన్ని కన్నడ, మలయాళ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ సినిమాల్లో కనిపించారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 1991లో వ్యాపారవేత్త రాజశేఖరన్ వివాహం చేసుకుని లైమ్ లైట్ నుండి పూర్తిగా తప్పుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు. కుమార్తెలు కార్తీక నాయర్, తులసి నాయర్ సినిమాల్లో నటించారు. ఆమె సోదరి అంబిక కూడా మంచి నటి. వీరిద్దరూ అనేక సినిమాల్లోనూ కనిపించారు. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‪కు వెళ్లిపోయిన రాధ.. కొన్ని రియాలిటీ షోస్‌లో కనిపించారు. తాజాగా చాన్నాళ్ల తర్వాత తెలుగులో చానల్ ప్రసారమౌతున్న బీబీ జోడీకి జడ్జిగా వచ్చి మెప్పించారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed