ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసింది. హిందీలో ఓ వెబ్ సిరీస్‌లో దేవసేనగా కనిపించింది. గ్లామర్, టాలెంట్ ఉన్నా కానీ ఎందుకో నటిగా సక్సెస్ కాలేకపోయింది.
సెలబ్రిటీల గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా పలు సామాజిక మాధ్యమాలలో స్టార్లను బేస్ చేసుకుని ఎన్నో మీమ్స్ వస్తుంటాయి. ఇక హీరో, హీరోయిన్ల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వారి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి ఫాలో చేస్తుంటారు. ఇక సెలబ్స్ చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ బయటకొస్తే, ఫ్యాన్స్, ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతుంటారు. హీరోయిన్స్ చిన్నప్పటి ఇమేజెస్ అయితే అందర్నీ ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ డాటర్ చైల్డ్‌హుడ్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. 80, 90 కాలంలో తన అందం, నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకాభిమానులను అలరించిన రాధ. అప్పట్లో స్టార్ కథానాయికగా ఓ వెలుగు వెలిగారామె. రాధకు కార్తీక, తులసి ఇద్దరు కుమార్తెలున్నారు. తల్లి బాటలోనే వారు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఈ ఫోటోలో ఉన్నది పెద్దమ్మాయి కార్తీక. నాగ చైతన్య ఫస్ట్ ఫిలిం ‘జోష్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ మూవీస్ చేసింది. కోలీవుడ్ ఫిలిం ‘కో’ (తెలుగులో రంగం) సూపర్ హిట్ అయింది.
తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు, హిందీలో ‘ఆరంభ్’ వెబ్ సిరీస్‌లో దేవసేనగా కనిపించింది. గ్లామర్, టాలెంట్ ఉన్నా కానీ ఎందుకో నటిగా సక్సెస్ కాలేకపోయింది. కొద్ది రోజులుగా తమ హోటల్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా గడుపుతున్న కార్తీక నాయర్ ఇటీవల యూఏఈ గవర్నమెంట్ నుండి గోల్డెన్ వీసా అందుకుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్స్‌తో పాటు గ్లామరస్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. జూన్ 27న తన పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ రాధ, కార్తీక చిన్ననాటి ఫోటోలు షేర్ చేశారు.