ఈ ఫోటోలో కనిపిస్తున్న అల్లరి పిల్లను గుర్తు పట్టారా?.. అబ్బో, కెమెరా వంక చూస్తూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది ఎవరబ్బా? అనుకుంటున్నారా.. పోల్చుకోవడం అంత కష్టమేమీ కాదు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న అల్లరి పిల్లను గుర్తు పట్టారా?.. అబ్బో, కెమెరా వంక చూస్తూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది ఎవరబ్బా? అనుకుంటున్నారా.. పోల్చుకోవడం అంత కష్టమేమీ కాదు. తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసి, తమిళ్, హిందీలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా హవా నడిపించింది. దాదాపు 10, 12 ఏళ్ల క్రితం హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. కాకపోతే సరైన ప్లానింగ్ లేకపోవడం, తనకు స్టార్ స్టేటస్ కట్టబెట్టిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తక్కువ చేసి చూడడం, పర్సనల్ లైఫ్‌లో కొన్ని సడెన్ డెసిషన్స్ తీసుకోవడం వంటి కొన్ని కారణాలతో కెరీర్ పరంగా బాగా వెనుకబడిపోయింది.
ఈ భామ ఎవరో కాదు.. గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్. ‘దేవదాసు’ మూవీతో యాక్ట్రెస్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఫస్ట్ మూవీకే ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా తన ఒంపుసొంపులకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ‘పోకిరి’ తో స్టార్‌డమ్ వచ్చేసింది. ‘రాఖీ’, ‘మున్నా’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ ఇలా క్రేజీ హిట్స్ అందుకుంది. మధ్యలో అమ్మడికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పారితోషికం పెంచేసింది. అప్పట్లోనే అక్షరాలా రూ.కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళంలో రెండు, ఓ కన్నడ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కానీ అవేమీ తన కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించలేదు.
ఎప్పుడైతే బాలీవుడ్ ఆఫర్ వచ్చిందో అప్పటినుండి సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వరుసగా హిందీలోనే నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అదే టైంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో రిలేషన్ షిప్ సాగించింది. కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొంత కాలంగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో డేటింగ్ చేస్తూ.. తర్వాత ప్రెగ్నెంట్ అని చెప్పి, తన బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది రివీల్ చెయ్యకుండా మిస్టరీ మెన్ అంటూ సస్పెన్స్ కంటిన్యూ చేసింది. ఇటీవలే ప్రియుడిని పరిచయం చేసింది ఇలియానా.