సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోల గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రేక్షకాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. వెండితెర మీద తారలుగా రాణిస్తున్న వారు చిన్నతనంలో ఎలా ఉండేవారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.
సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోల గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రేక్షకాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. వెండితెర మీద తారలుగా రాణిస్తున్న వారు చిన్నతనంలో ఎలా ఉండేవారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా?. నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్‌గానూ సత్తా చాటింది. తెలుగుతో పాటు మొత్తం 7 భాషల్లో సినిమాలు చేసింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ కాలు మోపి సక్సెస్ అయ్యింది. అచ్చతెలుగుదనం కొట్టేచ్చే అందం ఆమె సొంతం. పాత్ర ఏదైనా ప్రేక్షకులను అలరించడం ఆమె నైజం. ఆమే లలితా రాణి అలియాస్ జయప్రద. 1974లో తన 13వ ఏట ‘భూమికోసం’ అనే సినిమాలో రెండు, మూడు నిమిషాల పాటు కనిపించే పాత్ర చేసిన జయప్రద ఆ సినిమాకి గానూ రూ.10 పారితోషికం అందుకుంది.
అప్పటి నుండే తన పేరుని జయప్రదగా మార్చుకుంది. రజినీ కాంత్ హీరోగా కె.బాలచందర్ తీసిన ‘అంతులేని కథ’తో కథానాయికగా పరిచయమయ్యారు. పెదవి మీద పుట్టుమచ్చ, సహజమైన నటన, తెలుగుదనం కొట్టేచ్చే ఆహార్యం ఆమెను జనాలకు బాగా దగ్గర చేశాయి. ఎన్టీఆర్ – కె.రాఘవేంద్ర రావుల కలయికలో వచ్చిన ‘అడవి రాముడు’ తో జయప్రద కమర్షియల్ హీరోయిన్ అయిపోయారు. పాత్రకు తగ్గట్టు పరువాలు పరుస్తూ, కంటి చూపుతో కొంటెగా నవ్వడం ఆమె స్పెషాలిటీ.
తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యాక హిందీలో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, రాకేష్ రోషన్ వంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది. ‘యమగోల, సిరి సిరి మువ్వ’, ‘సాగర సంగమం’, ‘దేవత’, ‘మేఘ సందేశం’ ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అన్నీ కలిపి 300కు పైగా సినిమాలు చేశారు. ఆ రోజుల్లో హీరోలతో సమానంగా భారీ పారితోషికం తీసుకునేవారామె.