ఇప్పుడు చూడబోయే లిటిల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. హిందీ, కన్నడ, తమిళ్, బెంగాళీ, మరాఠీ, మలయాళం భాషల్లోనూ నటించింది.
సోషల్ మీడియాలో హీరోయిన్ల చిన్నప్పటి పిక్స్ బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో క్యూట్ లుక్స్, లవ్లీ స్మైల్‌తో చూడముచ్చటగా ఆకట్టుకుంటారు. ఇప్పటివరకు ఎంతోమంది కథానాయికల చైల్డ్‌హుడ్ ఇమేజెస్ చూశాం. ఇప్పుడు చూడబోయే లిటిల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. హిందీ, కన్నడ, తమిళ్, బెంగాళీ, మరాఠీ, మలయాళం భాషల్లోనూ నటించింది. ఆమె ఎవరో కాదు.. ముంబై ముద్దుగుమ్మ మంజరి ఫడ్నీస్. అల్లరి నరేష్ ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంజరి.. అంతకుముందే తన 20వ ఏట సన్నీ డియోల్ హీరోగా చేసిన ‘రోక్ సాకో తో రోక్ లో’ (Rok Sako To Rok Lo) తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది.
1984 జూలై 10న ముంబైలో పుట్టిన మంజరి.. ఇవాళ (జూలై 10) తన 39వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, స్నేహితులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. సినిమాల నుండి కాస్త గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషన్‌కి సంబంధించిన అప్‌డేట్స్ కూడా షేర్ చేస్తుంటుంది.
తెలుగులో కె.విశ్వనాథ్ ‘శుభప్రదం’, జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ వంటి చిత్రాల్లో నటించింది. మలయాళంలో మోహన్ లాల్ ‘మిస్టర్ ఫ్రాడ్’ లోనూ కనిపించింది. ప్రస్తుతం మరాఠీలో ‘అదృశ్య’ అనే మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. టీవీ, వెబ్ సిరీస్, ఆల్బమ్స్‌లోనూ అలరించింది మంజరి ఫడ్నీస్. ముఖ్యంగా నార్త్‌లో మంచి పాపులారిటీ దక్కించుకుంది.