ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారా? టెలివిజన్, సినిమా, ఫ్యాషన్ రంగాల్లో రాణించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
సెలబ్రిటీల చైల్డ్‌హుడ్ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. కొంతమందిని ఈజీగా గుర్తు పట్టెయ్యగలం కానీ మరి కొందరినైతే అస్సలు పోల్చలేం. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు కనిపిస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారా? టెలివిజన్, సినిమా, ఫ్యాషన్ రంగాల్లో రాణించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆమె ఎవరో కాదు. మందిరా బేడి. క్రికెట్ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. 1972 ఏప్రిల్ 15న కలకత్తాలో జన్మించారు మందిరా. ట్రెండ్ సెట్టర్ లవ్ స్టోరీ ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’ (DDLJ)లో ప్రీతి సింగ్ అనే క్యారెక్టర్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది మందిరా బేడి.
అంతకుముందు 1994 – 1998 ప్రసారమైన ‘శాంతి’ అనే హిందీ సీరియల్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్రికెట్ కామెంట్రీ ఆమెకు పేరు ప్రఖ్యాుతులు తెచ్చి పెట్టింది. క్రికెట్ లవర్స్, మందిరా బేడి కామెంటరీ కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. తర్వాత హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసింది. శింబు నటించిన ‘మన్మథన్’ (తెలుగులో మన్మథ)లో మెరిసింది. పలు వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేసిందామె. ప్రభాస్ ‘సాహో’ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఫ్యాషన్ డిజైనర్‌గానూ తన అభిరుచిని చాటుకుంది మందిరా. ప్రొఫెషన్ పరంగా మల్టీ టాలెండ్ అనిపించుకున్న మందిరా జీవితం కొద్ది రోజుల క్రితం వరకు హ్యాపీగా ఉండేది. భర్త చనిపోయిన తర్వాత ఆమె తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. దర్శక నిర్మాత అయిన రాజ్ కౌషల్‌ను 1999లో మ్యారేజ్ చేసుకుని, 2011లో ఓ బాబుకి జన్మనిచ్చిన మందిరా.. ఆ తర్వాత ఓ పాపను దత్తత తీసుకున్నారు. రాజ్ కౌషల్ 2021 జూన్ 30న గుండెపోటుతో కన్నుమూశారు.