ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?. ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కానీ గుర్తు రావడం లేదు కదా.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం.. తండ్రి నుంచి నటనను వారసత్వంగా తీసుకుని కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగులో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?. ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కానీ గుర్తు రావడం లేదు కదా.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం.. తండ్రి నుంచి నటనను వారసత్వంగా తీసుకుని కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగులో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులను కూడా సంపాదించుకుంది. తన వాయిస్ డిఫరెంట్.. పర్సనాలిటీ మీద కొందరు కామెంట్స్ చేసినా పట్టించుకోదు. ఎందుకంటే ఒకరకంగా తనకు రికగ్నైజేషన్ తెచ్చిపెట్టింది అదే. బొద్దుగా కనిపించినా ముద్దుగా తనదైన నటనతో అలరిస్తుంటుంది. 2012 నుంచి కోలీవుడ్, టాలీవుడ్ అప్ అండ్ డౌన్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో కాదు..
విద్యుల్లేఖ రామన్.. అలియాస్ విద్యు. విద్యు రామన్. చెన్నైలో పుట్టి పెరిగింది. తండ్రి మోహన్ రామన్ తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్. తాత దగ్గరి నుంచి ఫ్యామిలీలో అందరూ విద్యావంతులే. 2012లో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘నీతానే ఎన్ పోన్‌వసంతం’ (ఎటో వెళ్లిపోయింది మనసు) తో ఎంట్రీ ఇచ్చింది. ఆకారం, డైలాగ్ డెలివరీ ఆమె హాస్యనటిగా స్థిరపడేలా చేశాయి. తమిళం, తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్లకు ఫ్రెండ్‌గా కనిపించింది. ‘రన్ రాజా రన్’, ‘రాజు గారి గది’, ‘భలే మంచి రోజు’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘నిన్నుకోరి’, ‘రాజా ది గ్రేట్’, ‘భాగమతి’, ‘తొలిప్రేమ’, ‘మహర్షి’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది.
అక్కడ, ఇక్కడ మంచి క్యారెక్టర్స్ చేసి ఫీమేల్ కమెడియన్‌గా ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. తమిళంలో టీవీ షోల్లో కూడా పార్టిసిపెట్ చేసింది. తన పర్సనల్ ఫిట్‌నెస్, న్యూట్రిషన్ ట్రైనర్‌తో ప్రేమలో పడింది విద్యుల్లేఖ. తర్వాత ఫిజిక్ మీద ఫోకస్ పెట్టి నాజూగ్గా మారింది. 2020 ఆగస్టు 26న నిశ్చితార్థం చేసుున్నారు. 2021 సెప్టెంబర్ 9న ఏడడుగులేశారు. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయి.. ప్రొఫెషన్‌కు కాస్త గ్యాప్ ఇచ్చింది. విద్యుల్లేఖ రామన్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.