ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఓ సూపర్ స్టార్. నటన అనేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినా తనకంటూ ఓన్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. తెరమీదే కాదు నిజ జీవితంలోనూ కథానాయకుడు, ప్రతి నాయకుడూ తనే.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఓ సూపర్ స్టార్. నటన అనేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినా తనకంటూ ఓన్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. తెరమీదే కాదు నిజ జీవితంలోనూ కథానాయకుడు, ప్రతి నాయకుడూ తనే. పడి పోయిన వాడు కాదు, తప్పు తెలుసుకుని తిరిగి నిలబడి గెలిచివాడే గొప్పవాడు అన్నట్లు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పుట్టుకతోనే బంగారు చెంచాతో పుట్టడం వల్లనేమో త్వరగా చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఎంతలా అంటే అనుకోకుండా సంభవించిన పరిస్థితుల వల్ల జైలు జీవితం గడిపేంత. పర్సనల్, ప్రొఫెషన్ పరంగా ఆటు పోట్లు ఎదురయ్యాయి. ఆ స్థానంలో మరొకరుంటే ఏం జరిగేది? అని ఊహించడమే కష్టం. కానీ తన తప్పు తెలుసుకున్నాడు. లేచి నిలబడ్డాడు. మంచికో, చెడుకో కానీ తన జీవితం ఆదర్శమనే చెప్పొచ్చు.
ఈ బుడతడు ఎవరో కాదు.. ఖల్ నాయక్, సంజూ బాబా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ అలియాస్ సంజయ్ బాల్ రాజ్ దత్. తన జీవితం మీద ‘సంజు’ పేరుతో బయోపిక్ తెరకెక్కించగా ఘన విజయం సాధించింది. నిజ జీవిత కథతో సినిమా అంటే వాస్తవాలను కాస్త రహస్యంగానే ఒదిలేస్తారు. కానీ సంజయ్ విషయంలో ఉన్నది ఉన్నట్లుగా చూపించి, తప్పుకి తను ఎంత ప్రాయశ్చిత్తపడ్డాడో, చెడ్డ అలవాట్ల నుంచి బయట పడడానికి ఎంత ప్రయత్నించాడో, యువత ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపించారు. బహుశా ఆ డేర్ చేసిన సెలబ్రిటీ సంజయ్ దత్ మాత్రమేనని చెప్పొచ్చు. తండ్రి సునీల్ దత్, తల్లి నర్గీస్ దత్ ఎంతటి లెజెండరీ పర్సనాలిటీస్ అనేది తెలిసిందే.
సినిమాల పరంగా ఫ్లాప్స్, హిట్స్ కామన్. అయితే సంజయ్ దత్ కెరీర్‌లో మాత్రం అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రాలు, రీ ఎంట్రీ, కమ్ బ్యాక్ ఫిలింస్ ఉన్నాయి. తన 12వ ఏట తండ్రి నటించిన ‘రేష్మా ఔర్ షేరా’ తో కెరీర్ స్టార్ట్ అయ్యింది. హీరోగా ఫస్ట్ మూవీ ప్రీమియర్‌కి కొద్ది రోజుల ముందు తల్లి మరణంతో మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. 3వ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి కోలుకున్నాడు. ‘కె.జి.యఫ్’ పార్ట్ 2లో ‘అధీరా’ గా అదరొగొట్టేశాడు. ప్రస్తుతం దళపతి విజయ్, లోకష్ కనకరాజ్‌ల ‘లియో’ లో ‘ఆంటోని దాస్’ అనే విలన్‌గా కనిపించనున్నారు. జూలై 29న సంజయ్ 64వ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ లో విలన్‌గా ‘బిగ్ బుల్’ అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు పోస్టర్ వదిలారు.
ఇది కూడా చదవండి : ‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?