ఇప్పుడిప్పుడే తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్న సెలబ్రిటీలు కొన్నిసార్లు తెలియక పొరపాట్లు చేస్తే వారిని తప్పు పడుతూ.. ఆ విషయాన్ని కాంట్రవర్సీ చేసేంత వరకు వదిలిపెట్టడం లేదు సోషల్ సైనికులు. . మీరు తప్పు చేస్తే ఎలా అంటూ మండిపడిపోతుంటారు. ఇప్పుడు ఓ నటుడి భార్య ఓ వివాదంలో చిక్కుకున్నారు.
సోషల్ మీడియా వచ్చాక.. సెలబ్రిటీల పట్ల నెటిజన్లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఏ విషయంలో వారి మనోభావాలు దెబ్బతింటున్నాయో తెలియడం లేదు. ఇప్పుడిప్పుడే తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్న సెలబ్రిటీలు కొన్నిసార్లు తెలియక పొరపాట్లు చేస్తే వారిని తప్పు పడుతూ.. ఆ విషయాన్ని కాంట్రవర్సీ చేసేంత వరకు వదిలిపెట్టడం లేదు సోషల్ సైనికులు. అలాగే బాధ్యతగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇలా చేస్తే మిమ్మల్ని సామాన్యులు ఫాలో అవుతుంటారని.. మీరు తప్పు చేస్తే ఎలా అంటూ మండిపడిపోతుంటారు. ఇప్పుడు ఓ నటుడి భార్య ఓ వివాదంలో చిక్కుకున్నారు.
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ నటుడు, 90వ దశకంలో హాస్య కథానాయకుడు అంటే గుర్తుకు వచ్చేది గోవిందా. ఆయన సతీమణి సునీత అహుజా చిక్కుల్లో పడ్డారు. ఈ నెల 15న ఆమె ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ఫోటోల్లో ఆలయ గర్భగుడిలోకి ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లినట్లు కనిపిస్తుంది. అమ్మవారి ఆలయంలోకి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్లకూడదన్న నిబంధన ఉంది. అవి మరచి ఆమె వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె ప్రవర్తించారంటూ ఫైర్ అవుతున్నారు.
ఆమె బ్యాగ్ తీసుకెళుతున్న భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకోలేదెందుకని అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల..బ్యాగును లోపలికి తీసుకెళ్లేందుకు ఎలా అనుమతించారనే విషయాన్ని సీసీ ఫుటేజీని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది గేటు వద్ద తనిఖీలలో నిమగ్నమై ఉన్నారని.. ఆలయ నిర్వాహకులు సందీప్ సోనీ పేర్కొన్నారు. లోపలికి బ్యాగ్స్, పర్సులు తీసుకెళ్లకుండా చూడడం వారి బాధ్యత అని.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.