తొలివలపు చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. 21 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఎంట్రీ ఇవ్వడమైతే హీరోగా ఇచ్చాడు.. కానీ ఆ తర్వాత పలు చిత్రాల్లో విలన్‌గా నటించాడు. మరీ ముఖ్యంగా వర్షం, జయం, నిజం సినిమాలో ఆయన పండించిన విలనీజం పీక్స్ అని చెప్పవచ్చు. గోపిచంద్ ప్రముఖ తెలుగు దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. అయితే గత కొంత కాలంగా వరుస ప్లాఫ్‌లు గోపీచంద్‌ను వెంటాడుతున్నాయి. తాజాగా రాశీ ఖన్నా, గోపీచంద్ కాంబినేషన్‌లో మారుతి దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబీనేషన్‌లో లౌక్యం, లక్ష్యం చిత్రాలు వచ్చి.. విజయం సాధించాయి.
సినిమాలతో బిజీగా ఉండే గోపీచంద్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలా తక్కువగా బటయకు వస్తాయి. ఈ విషయంలో చాలా ప్రైవసీని మెయింటైన్ చేస్తాడు గోపీచంద్. ఆయనకు శ్రీకాంత్ మేనకోడలు రేష్మాతో వివాహం జరిగిన సంగతి తెలిసింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయికి తండ్రి కృష్ణ పేరు పెట్టుకున్నాడు గోపీచంద్. ఇక చిన్న కుమారుడి పేరు వియాన్. పిల్లల ఫోటోలు కూడా ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు.
ఈ క్రమంలో తాజాగా గోపీచంద్ చిన్నకుమారుడు వియాన్ ఫోటోలు నెట్టింట వైరలవుతోన్నాయి. వీటిల్లో.. తండ్రి కొడుకులిద్దరూ మ్యాచింగ్ డ్రెసుల్లో.. ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు. తండ్రి మీద కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ.. తన క్యూట్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకుంటున్నాడు వియాన్. ఈ ఫోటోలు చూసిన నెటిజనులు.. వియాన్ సో క్యూట్.. చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.