Gopichand: సినీ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్స్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న నటులు.. ఆ తర్వాత హీరోలుగా సినిమాలు చేయడమనేది సాధారణ విషయమే. ఎందుకంటే.. హీరో క్యారెక్టర్ కి కావాల్సిన విషయాలన్నీ విలన్ రోల్స్ చేసే నటులలో ఉన్నాయంటే ఖచ్చితంగా హీరోగా సినిమాలు చేస్తుంటారు. ఆ విధంగా టాలీవుడ్ లో విలన్ గా సక్సెస్ అయ్యాక హీరోగా మారిన నటులలో గోపీచంద్ ఒకరు.
తొలివలపు సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన గోపీచంద్.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో జయం, నిజం సినిమాలతో విలన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు. ఆ టైంలో విలన్ రోల్స్ కి గోపిచంద్ చాలా ఫేమస్ అయిపోయాడు. కానీ.. వర్షం విడుదలైన ఏడాదే యజ్ఞం మూవీతో హీరోగా బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.
ఇక అప్పటినుండి విలన్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేసి హీరోగా కంటిన్యూ అవుతున్నాడు గోపీచంద్. అయితే.. హీరోగా సక్సెస్ అయ్యాక కొన్ని సినిమాలు హిట్స్ వచ్చినా.. ఎక్కువగా ప్లాప్స్ నే మూటగట్టుకున్నాడు. 2014లో లౌక్యం మూవీ సక్సెస్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ని ఇప్పటివరకూ అందుకోలేకపోయాడు గోపి. వరుస ప్లాప్స్ తో డిఫెరెంట్ సినిమాలు చేస్తున్నప్పటికీ, పేరైతే వస్తోంది గాని, బాక్సాఫీస్ వద్ద సినిమాలు నిలబడటం లేదు.
ఈ క్రమంలో గోపీచంద్ ని మళ్లీ పవర్ ఫుల్ విలన్ రోల్స్ లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే.. విలన్ పాత్రలలో గోపీచంద్ వీరోచిత నటన మనం ఇదివరకే చూశాం. విలన్ గా ఏ స్థాయిలో విజిల్స్ వేయించగలడో అందరికీ తెలుసు. ఇటీవలే ‘పక్కా కమర్షియల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. కానీ సినిమా పెద్దగా సందడి చేయలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. విలన్ గా గోపీచంద్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు, మహేష్ బాబుకు స్టార్డమ్ తెచ్చిన ‘ఒక్కడు’ మూవీని వదులుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ విషయంపై గోపీచంద్ కూడా రీసెంట్ గా స్పందించాడు. “ఒక్కడు మూవీలో విలన్ పాత్రకోసం నన్ను అడిగారు. ప్రకాష్ రాజ్ గారికి డేట్స్ ఖాళీగా లేవని చెప్పారు. గుణశేఖర్ గారు కథ చెప్పాక నాకు బాగా నచ్చి ఓకే చేశాను. కానీ.. ఆ తర్వాత కొన్నిరోజులకు మళ్లీ ప్రకాష్ రాజ్ గారు డేట్స్ అడ్జస్ట్ చేస్తానన్నారట. ఆ విధంగా ఒక్కడు మిస్ అయ్యింది” అని చెప్పాడు. ప్రస్తుతం గోపి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.+