మెగా ఫ్యాన్స్‌కు వరుసగా గుడ్ న్యూస్‌లు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ కోలుకున్నాడు. రిపబ్లిక్ మూవీ టీజర్‌ను సాయిధరమ్ తేజ్ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రిపబ్లిక్ టీమ్ మెగా అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని జీ స్టూడియోస్ అధికారికంగా తమ యూట్యూబ్ ఛానల్‌లో ‘పవన్ ఫర్ SDT’ అంటూ వెల్లడించింది. సెప్టెంబర్ 25న జరగనున్న ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ సందడి చేయనున్న విషయం కన్ఫమ్ అయిపోయింది.
సెప్టెంబర్ 10న జరిగిన ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కల్యాణ్, చిరంజీవి అందరూ పరుగున ఆస్పత్రికి రావడం చూస్తేనే అందరికీ అర్థమైపోతుంది మేనల్లుడిపై మామలకు ఎంత ప్రేమ ఉదో. అల్లుడికి కష్టం రాగానే మామలు మేమున్నామంటూ సపోర్ట్ చేస్తున్నారు. రిపబ్లిక్ మూవీ టీజర్‌ను చిరంజీవి రిలీజ్ చేయడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ రావడంపై మెగా అభిమానులు ఆనందంతో పొంగి పోతున్నారు. గతంలోనూ పవన్.. సాయిధరమ్ తేజ్‌తో సన్నిహితంగా ఉండటం.. అతని సినిమాలను ప్రమోట్ చేయడంలో పవన్ ఎప్పుడూ ముందుంటాడు. మరోసారి అదే విషయం రుజువైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయిధరమ్ తేజ్ కూడా వస్తాడని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. మరో రెండ్రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని ఇప్పిటకే వార్తలు వచ్చాయి. ఈవెంట్ వార్తతో అది దాదాపుగా ఖాయమైపోయినట్లుగానే కనిపిస్తోంది.