ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్స్ పరంగా స్టార్ హీరోలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నారో.. ఆల్రెడీ ఉన్న రికార్డులను ఎలా తిరగరాస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఒక హీరోని మించి మరో హీరో సినిమా కలెక్షన్స్ ఎక్కువగా రాబట్టాలనే పోటీ కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. కాలంతో పాటు ఇండస్ట్రీలో కూడా మార్పులు జరిగేసరికి.. చిన్న హీరోలు, డెబ్యూ హీరోల సినిమాలు సైతం కాస్తోకూస్తో బాక్సాఫీస్ వద్ద బెటర్ పెర్ఫార్మన్స్, బెటర్ కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ.. కొందరి సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ జరగడంతో వచ్చిన కలెక్షన్స్ వసూల్ చేయడం అనేది గగనం అయిపోతుంది.
మూవీ కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా తడబడుతోంది. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. రిలీజ్ రోజున మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. టాక్ సంగతి పక్కన పెడితే.. కలెక్షన్స్ పరిస్థితి మాత్రం దారుణంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ సూర్య తెరకెక్కించాడు. అదీగాక తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన జిన్నా మూవీని సొంత బ్యానర్ లో నిర్మించాడు మంచు విష్ణు. అయితే.. మొత్తం వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి రూ. 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో జిన్నా మూవీ కలెక్షన్స్ మూడు రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో రూ. 30 లక్షలు.. వరల్డ్ వైడ్ చూసుకుంటే దాదాపు రూ. 35 లక్షలు ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక వరల్డ్ వైడ్ మూడు రోజుల్లో జిన్నా మూవీ గ్రాస్ రూ. 55 లక్షలపైగా జరిగిందని సమాచారం. ఈ లెక్కన ఇంకా ఈ సినిమా సుమారు రూ. 4 కోట్లకు పైనే వసూల్ చేయాల్సి ఉంది. దీపావళి పండుగ సమయం కలిసొస్తుందని భావించిన మంచు విష్ణుకు జిన్నా మూవీతో మరోసారి నిరాశే ఎదురైందని.. టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ రాలేవని అంటున్నారు. ఇక దీపావళి సమయాన్ని పూర్తిగా డబ్బింగ్ చిత్రాలు కాంతార, సర్దార్, ప్రిన్స్ సినిమాలు క్యాష్ చేసుకోవడం గమనార్హం. మంచు ఫ్యామిలీ సినిమాలకే ఇలా జరుగుతుండటం వెనుక భారీ కుట్ర దాగి ఉందనే కామెంట్స్ కూడా సినీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. మరి చూడాలి ఇకపై మంచు విష్ణు సినిమాలపై ఎలాంటి కేర్ తీసుకుంటారో!