గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న మరణించిన సంగతి మనందరికి తెలిసిందే. దాంతో మహేశ్ బాబు కుటుంబంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. అదీ కాక ఈ ఏడాదిలోనే ఘట్టమనేని కుటుంబంలో మూడు మరణాలు చోటుచేసుకోవడం దిగ్భ్రాంతి కరమైన విషయం. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి, మహేశ్ అన్న రమేష్ బాబు ఇదే సంవత్సరంలో కన్ను మూసిన విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే మంగళవారం (నవంబర్ 22) న సూపర్ స్టార్ కృష్ణ-ఇందిరా దేవిల పెళ్లి రోజు కావడంతో కూతురు మంజుల ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎమోషన్ పోస్ట్ చేసింది. మీ వివాహబంధం స్వర్గంలో కొనసాగేంత గొప్ప బంధం నాన్న.. అందుకే మమ్మల్ని విడిచి అమ్మ దగ్గరికి వెళ్లావు అంటూ భావోద్వేగ పూరితంగా రాసుకొచ్చింది మంజుల.
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీ ప్రపంచం తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక కుటుంబ సభ్యులు సైతం ఎంతో వేదనకు గురైయ్యారు. కృష్ణ మరణించి కొన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు ఆయన మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా కృష్ణ కూతురు మంజుల తల్లిదండ్రుల పెళ్లిరోజు సందర్బంగా.. తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా భావోద్వేగపూరితమైన మాటలు రాసుకొచ్చింది.”మీ 60 ఏళ్ల వివాహ బంధానికి మేం ఐదుగురం పిల్లలం. ఇక మీ వైవాహిక జీవితం స్వర్గంలో సైతం కొనసాగేంత గొప్పది. అందుకే మమ్మల్ని విడిచి మీరు అమ్మ దగ్గరికి వెళ్లారు. అమ్మా మీరెల్లి పోయిన తర్వాత నాన్న మిమ్మల్ని చాలా మిస్ అయ్యారని అనుకుంటున్నాను. నిజంగా మీ ఆత్మలు కూడా సహచరులే అనుకుంటా” అంటూ ఎమోషనల్ అయ్యింది మంజుల.
ఇక మీరు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టం. ఇక మాపై మీ ప్రేమ ఎప్పుడూ ఉంటుందని మంజుల పేర్కొంది. అలాగే మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అని మంజుల అన్నారు. ఇక మీ స్వచ్చమైన మనసులాగా 10 శాతమైనా మేం మారితే.. అదే మేం మీకిచ్చే నిజమైన బహుమతిగా నేను భావిస్తున్నా అని పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మానాన్న అంటూ రాసుకొచ్చింది మంజుల. దీనితో పాటుగా కృష్ణ, ఇందిరా దేవిలు కలిసి ఉన్న ఫొటోను జతచేసింది. ప్రస్తుతం మంజుల షేర్ చేసిన ఈ ఫొటో మరోసారి సూపర్ స్టార్ అభిమానులకు గుర్తుచేసింది.