జెనీలియా.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే డైలాగ్ అంతేనా? ఇంకేంకావాలి. ఇప్పటికీ హహా హాసినీ అంటూ జెనీలియాను పిలుస్తారు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం భర్త, పిల్లలే ఆమె లోకంగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. తాజాగా ఓ విషయంలో ఎమోషనల్ అయ్యింది. పిపల్లు అడిగిన ఒక ప్రశ్న జెనీలియాను భావోద్వేగానికి గురిచేసింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, జెనీలియా మామ విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ఆగస్టు 14, 2012లో కాలం చేసిన విషయం తెలిసిందే. విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌ను జెనీలియా కూడా పప్పా అని పిలుస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఇలా పోస్ట్ చేసింది. “పప్పా ఈరోజు రియాన్, రహైల్ నన్ను ఓ ప్రశ్న అడిగారు. అమ్మ మేము తాతను ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెబుతారా? అని నన్ను అడిగారు” అంటూ చెప్పుకొచ్చింది.
అందుకు జెనీలియా ఏం సమాధానం చెప్పిందంటే.. “నేను వెంటనే వారికి అవును.. మీరు వినగలిగితే ఆయన సమాధానం చెప్తారు అని చెప్పాను. ఇన్నేళ్లు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెబుతూనే ఉన్నారు. నేను వింటూనే ఉన్నాను. మాకు ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే మీరు అండగా ఉంటూనే వస్తున్నారు. మాకోసం ఎప్పుడూ ఉంటానని మీరు మాటిచ్చారు. మా చెవులను ఓపెన్ చేసి, మా కళ్లు తెరిచి మీ మాటలను ఎప్పుడూ వింటూనే ఉంటాం. వీ మిస్ యూ పప్పా” అంటూ జెనీలియా రాసుకొచ్చింది. జెనీలియా ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.