గుజరాత్ తీగల బ్రిడ్జి ప్రమాదం దేశ వ్యాప్తంగా పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఆదివారం మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న తీగల బ్రిడ్జి కూలింది. జనం పెద్ద సంఖ్యలో దానిపై సందడి చేయటంతో ఈ విషాదం నెలకొంది. దాదాపు 140 మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన టైంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆ బ్రిడ్జి కూలటానికి యువకుల అత్యుత్సాహమే కారణమని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ప్రముఖ తమిళ నటి గాయత్రి స్పందించారు.
ట్విటర్‌లో సోమవారం ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ ఓ యువకుడు బ్రిడ్జిని గట్టిగా ఊపుతూ కెమెరాకు చిక్కాడు. అక్కడ బ్రిడ్జిపై ఉన్న చాలా మంది అదే పని చేశారు. అది ఇప్పుడు 130 మందికి పైగా ప్రాణాలను తీసింది. ఇలాంటి ఘటనే కొన్ని రోజుల క్రితం కొరియాలో చోటుచేసుకుంది. హాలోవెన్ రాత్రి సందర్భంగా కలకలం చెలరేగటంతో తొక్కిసలాట జరిగి 150 మంది చనిపోయారు. పబ్లిక్‌లోకి వచ్చినపుడు యువత చాలా బాధ్యతగా ఉండాలి’’ అని పేర్కొన్నారు. కాగా, గుజరాత్‌లోని దర్బార్‌గఢ్ – నాజర్‌బాగ్‌ని కలుపుతూ ఈ తీగల వంతెన 1879 లో నిర్మించారు.
అప్పట్లో ఈ బ్రిడ్జీ నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు ఖర్చు అయినట్లు చరిత్ర చెబుతోంది. 2001లో గుజరాత్‌లో భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా ఈ బ్రిడ్జీ కొద్దిగా పాడైంది. బ్రిడ్జిని రిపేర్ చేసే బాధ్యతలను ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పింది. దాదాపు రెండు కోట్లతో ఏడు నెలల పాటు దీని మరమ్మత్తులు జరిగాయి. ఆ సమయంలో బ్రిడ్జీపైకి పర్యాటకుల రావడాన్ని నిషేదించారు. తాజాగా, ఈ నెల 26న ఈ వంతెనపైకి జనాలకు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన నాలుగు రోజుల్లోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
The young man shaking the bridge is caught on camera. Many others did same act. Now it caused more than 130 lives. Similar thing happened in Korea during Halloween night 150 died due to stampede. Youth should be more responsible in public. pic.twitter.com/3XCRqAumZy
— Gayathri Raguramm 🇮🇳🚩 (@BJP_Gayathri_R) October 31, 2022