ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మూవీ పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకొని మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అయితే.. పుష్ప సినిమా థియేటర్ల నుండి వెళ్లిపోయి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నా సినిమా పై సోషల్ మీడియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని సాంగ్స్, డైలాగ్ లను సామాన్యుల నుండి నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకు ‘తగ్గేదేలే‘.. అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు.
సినీ అభిమానుల నుండి పుష్ప డైలాగ్స్ కి సూపర్ క్రేజ్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం యువత పై పడుతున్న పుష్ప ప్రభావం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడనే సంగతి తెలిసిందే. అయితే.. హీరో అనేవాడు ఏదైనా మంచి దారిలో పైకొచ్చే కథ చూపించాలి గాని, ఓ స్మగ్లర్ ని ‘తగ్గేదేలే’ అని చూపించడం కరెక్ట్ కాదని పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు పుష్ప చిత్రబృందం పై విమర్శలు గుప్పించారు.ప్రస్తుతం గరికపాటి మాటలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. “స్మగ్లింగ్ చేసేవాడిని తగ్గేదేలే అని చూపిస్తే.. ఆ సినిమా ప్రభావం కారణంగా కుర్రాళ్ళు గొడవపడి తగ్గేదేలే అంటారు. దానికి ఎవరు కారణం..? ఆ హీరోని గానీ, ఆ డైరెక్టర్ ని గానీ నాకు సమాధానం చెప్పమనండి.. కడిగేస్తాను వాళ్లని. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు జరుగుతున్నాయి. ఈ తగ్గేదేలే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు లాంటివారు అనాలి. ఓ స్మగ్లర్ అనడం ఏంటి?” అంటూ గరికపాటి తన భావాన్ని సూటిగా బయట పెట్టారు.
పుష్ప రాజ్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. pic.twitter.com/ZAor5un2Wc
— . (@IamKKRao) February 2, 2022
ఇక గరికపాటి మాటలకు కొందరు ఏకీభవిస్తున్నప్పటికీ, మరికొందరు సినిమాని సినిమాలా చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి గరికపాటి ప్రశ్నలకు పుష్ప బృందం ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మించగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.