గీతానంద్ హీరోగా, 90 ఎంఎల్ ఫేమ్ నేహా సోలంకి హీరోయిన్ గా కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్న చిత్రం గేమ్ ఆన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది.
గీతానంద్ హీరోగా, 90 ఎంఎల్ ఫేమ్ నేహా సోలంకి హీరోయిన్ గా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఆన్. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రవి కస్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే దయానంద్, గీతానంద్ లు సోదరులు కావడం విశేషం. తమ్ముడు దయానంద్ దర్శకత్వంలో అన్న గీతానంద్ హీరోగా నటిస్తున్నారు. ఇక మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్ సంగీతం అందించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది.
అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ పాడిన ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’ పాట సంగీత ప్రియుల మనసు గెలుచుకుంది. గేమ్ ఆన్ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన సందర్భంగా.. ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత రవి కస్తూరి మాట్లాడారు. గతంలో విడుదల చేసిన గేమ్ ఆన్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. నవాబ్ గ్యాంగ్ ఈ సినిమా కోసం చక్కని సంగీతం అందించారని అన్నారు. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా టైటిల్ సాంగ్ కి పని చేశారని.. అంత బిజీలో కూడా తమ సినిమా కోసం పని చేశారని.. అద్భుతమైన సంగీతాన్ని అందించారని అన్నారు.
ఇప్పుడు విడుదలైన రెండవ పాటకు మంచి స్పందన వచ్చిందని, దీంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని.. ఈ సినిమా ట్విస్టులు, మలుపులతో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుందని అన్నారు. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయని అన్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ కాగా, ఎడిటర్ వంశీ అట్లూరి. నేపథ్య సంగీతాన్ని అభిషేక్ ఏ.ఆర్ అందిస్తున్న ఈ చిత్రంలో వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.