ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ. ఎన్నో ఏళ్లుగా డాన్సర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఝాన్సీకి.. శ్రీదేవి డ్రామా కంపెనీ మరో లైఫ్ ఇచ్చింది. అందులో చేసిన ‘పల్సర్ బైక్’ మాస్ పెర్ఫార్మన్స్ తో ఝాన్సీకి ఫ్యాన్ ఫాలోయింగ్.. చిన్నపాటి సెలెబ్రిటీ హోదా లభించాయని చెప్పవచ్చు. అయితే.. ఇప్పుడు గాజువాక కండక్టర్ ఝాన్సీ అనగానే ఆమెను జనాలు గుర్తిస్తున్నారంటే.. కేవలం ఆమె హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది. ఎన్నో ఏళ్లుగా డాన్సర్ గా పలు టీవీ షోలలో ప్రయత్నాలు చేసిన ఝాన్సీకి.. పదేళ్ల తర్వాత గుర్తింపు రావడం జరిగింది.
ఈ క్రమంలో ఓవైపు బస్ కండక్టర్ గా జాబ్ చేస్తూ, డాన్సర్ గా కంటిన్యూ అవుతున్న ఝాన్సీకి.. మొదటినుండి తన భర్తే అండగా ఉంటూ వస్తున్నాడని చెప్పింది. అలాగే తనకు డాన్స్ నేర్పింది రమేష్ మాస్టర్ అని చెప్పి ఆయనకు క్రెడిట్ ఇచ్చింది. అయితే.. డాన్సర్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఝాన్సీ.. ఫేమ్ లోకి వచ్చాక ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఫేస్ చేస్తోంది. ఝాన్సీ చేసిన స్టేజి పెర్ఫార్మన్స్ లు చూసి కొంతమంది సపోర్ట్ చేస్తుంటే.. మరికొంతమంది సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, లైఫ్ స్ట్రగుల్స్ తో పాటు మ్యారేజ్ గురించి కూడా మాట్లాడింది.
అంతేగాక తనతో పాటు తన భర్తను కూడా కామెంట్స్ లో తిడుతున్నారని వాపోయింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకి ఝాన్సీ తన భర్తతో పాటు హాజరైంది. ఈ నేపథ్యంలో ఝాన్సీ, ఆమె భర్త వారి కెరీర్ తో పాటు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎవరైనా కామెంట్స్ చేసినప్పుడు.. ఆ సిట్యుయేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పావా? అని ఝాన్సీ భర్తను అడిగారు. అందుకు ఝాన్సీ భర్త స్పందిస్తూ.. “కొత్తలో నా భార్యను కామెంట్స్ చేసిన ఒక్కొక్కరిని కొట్టేవాడిని” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరి ఇంటర్వ్యూకి సంబంధించి ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.