తెలుగు బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ స్టార్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. జబర్థస్త్‌లో ఓ చిన్న కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి.. హీరో స్థాయికి ఎదిగారు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా బుల్లి తెరకు మాత్రం దూరం కావటం లేదు. ఓ వైపు టీవీలో షోలో చేస్తూనే.. మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అడపాదడపా హీరోగా అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇక, సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘‘గాలోడు’’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాలోడు సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి.
ప్రస్తుతం సూపర్ కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలోనూ ‘గాలోడు’ తన సత్తా చాటాడు. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా కలెక్షన్లను కొల్లగొట్టాడు. సుధీర్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా ‘గాలోడు’ నిలిచింది. ఈ సినిమా ఆంధ్రాలో దాదాపు 47 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. నైజాంలో 36 లక్షల రూపాయలు.. సీడెడ్‌లో 18 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 1.01 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1.05 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.
గాలోడు సినిమాకు ఊహించని విధంగా బెస్ట్ కలెక్షన్లు రావటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి నటించింది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు దర్శకత్వం వహించిన రాజశేఖరరెడ్డి పులిచర్ల.. గాలోడు సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఆయనే ఈ సినిమాను తెరకెక్కించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక, ఈ సినిమాకు సుధీర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.