నటి ప్రగతి సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ వీడియోలతో పాటు ఎన్నో డాన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రముఖ్ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్ షా “ఊడూ” అనే ట్రెండింగ్ ట్రాక్ కు స్టెప్పులేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో నటి ప్రగతితో పాటు ఇంకో యువతి కూడా స్టెప్పులేసింది. అంతా ప్రగతి పక్కన సూపర్ స్టెప్పులేసిన యువతిని చూసి ప్రగతి కుమార్తె అని అనుకుంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కుమార్తె కంటే నటి ప్రగతినే బాగా డాన్స్ చేస్తోందంటూ కొందరు, తల్లిలాగానే కూతురు కూడా సూపర్ డాన్సర్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
అయితే అందరూ అనుకున్నట్లు ప్రగతితో డాన్స్ చేసిన యువతి ఆమె కుమార్తె కాదు. అవును మీరు చదివింది నిజమే.. ప్రగతితో డాన్స్ చేసిన స్నేహా మురళి తమిళ అమ్మాయి. తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో బాగా ఫేమస్ అయిన నటి జయా మురళి కుమార్తె. స్నేహా మురళి కూడా నటే కావడం విశేషం. నటి ప్రగతి- స్నేహా మురళి వైరల్ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.