షమ్నా ఖాసీమ్ అలియాస్ పూర్ణ.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. కాబోయే వాడిని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరియచం కూడా చేసింది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నా జీవితంలో కొత్త ఛాప్టర్ ప్రారంభిచబోతున్నాను అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతోందని తెలిసినప్పటి నుంచి.. అసలు ఎవరు ఈ అసిఫ్ అలీ అంటూ అందరూ వెతుకులాట ప్రారంభించారు. అసలు అతను ఏం చేస్తాడు? ఎక్కడ ఉంటాడు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
షానిద్ అసిఫ్ అలీ ఓ వ్యాపార వేత్త.. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈవో. దుబాయ్ వేదికగా వీరి జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తుంటుంది. ఇది ఒక బిజినెస్ కన్సల్ టెన్సీ, డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్ అందించే సంస్థ. యూఏఈలో వ్యాపారుల చేసుకునే వారికి డాక్యుమెంటేషన్ పరంగా, అనుమతుల విషయంలో వీరు సర్వీసెస్ అందిస్తుంటారు. అంతేకాకుండా ఇమిగ్రేషన్, వీసా అనుమతులకు సంబంధించి కూడా సేవలు అందిస్తుంటారు. ఇంక షానిద్ అసిఫ్ అలీ ఆస్తుల విషయానికి వస్తే.. కోట్లలోనే ఉంటుందని సమాచారం.
With the blessings of family stepping to my next part of life❤️💍 and now it’s official ❤️ pic.twitter.com/v7Qo04t3Ws
— Purnaa (@shamna_kkasim) June 1, 2022
ఇంక పూర్ణ సినిమాల విషయానికి వస్తే.. తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో కలిపి మొత్తం ఈ ఏడాది 7 సినిమాల్లో నటిస్తోంది. పాదం పేసుం, పిశాసు 2, అమ్మాయి, నెంజుకు నీతి సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. టాలీవుడ్ లో ‘తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ’, బ్యాక్ డోర్ సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మలయాళంలో వ్రిధం అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.