సీనియర్ నటుడు నరేష్ పేరు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే.. అటూ కర్ణాటకలో కూడా మారు మోగి పోతుంది. పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌షిప్, మూడో భార్య రమ్యతో వివాదాల కారణంగా ఆయన మీద బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. నరేష్ ఇంకా తనకు విడాకులు ఇవ్వలేదని.. పవిత్రా లోకేష్‌ని ఎలా పెళ్లి చేసుకుంటారని ఆయన మూడో భార్య రమ్య ప్రశ్నిస్తుంది. ఇక మరోవైపు పవిత్రా లోకేష్ గురించి బోలేడన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నరేష్, ఆయన భార్య రమ్య ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే నరేష్, మూడో భార్య రమ్య కన్నా ముందు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు.. వారికి విడాకులు కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు జరిగినంత రచ్చ ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఈ క్రమంలో నెటిజనులు నరేష్ రమ్య కన్నా ముందు వివాహం చేసుకున్న వారు ఎవరు.. అయనకి ఎంత మంది సంతానం అనే విషయాల గురించి నెట్టింట తెగ సర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు..
నరేష్ తొలుత సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. పేరు నవీన్ విజయ్ కృష్ణ. సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. రెండు, మూడు సినిమాలు చేశాడు. ఆ తర్వాత నరేష్ ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు జన్మించిన తర్వాత ఆమెతో మనస్పర్థలు వచ్చి విడిపోయాడు నరేష్.
ఇది కూడా చదవండి: Naresh- Ramya Raghupathi: ఒకే రూమ్‌లో నరేశ్- పవిత్ర.. రెచ్చిపోయిన మూడో భార్య!
ఇక ఆ తర్వాత రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నాడు నరేష్. ఇది నరేష్‌కి మూడో పెళ్లి. కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తెనే నరేష్ మూడో భార్య రమ్య రఘపతి. వీరికి కూడా ఓ కొడుకు ఉన్నాడు. అయితే ఆమెతో గొడవల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు నరేష్. అయితే ఇంతలో నటి పవిత్రా లోకేష్‌తో కలిసి తిరగడం.. పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు రావడంతో.. ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఇక మరోవైపు రమ్య రఘపతి మాత్రం విడాకులు ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో ఈ వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఒకరిపై ఒకరు పలు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Naresh: నా మూడో భార్య ఆ టైప్.. నాకు మద్దతివ్వండి: నరేశ్
ఇక విజయనిర్మల కుమారుడైన నరేష్ బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకుడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్యచిత్రంగా నిలిచింది. కొద్దికాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు. ఇక తాజాగా మూడో భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Naresh- Ramya Raghupathi: నరేశ్ మూడో భార్య శపథం.. వాళ్లిద్దరూ ఎలా కలిసుంటారో చూస్తా!