సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లందరు దాదాపు మోడలింగ్ రంగం నుంచి వచ్చినవారే. మోడలింగ్, అడ్వర్టైజింగ్ రంగం నుంచి వచ్చిన హీరోయిన్లే పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి ఏకంగా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాల్ని దక్కించుకుంది హర్యానా సోయగం మానుషి చిల్లర్. గతంలో బాలీవుడ్ లో పృథ్వీరాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మానుషి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇదే ఊపుతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఏకంగా మెగా హీరోతో నటించడానికి ఈ అమ్మడు ఒప్పుకున్నట్లు వార్తలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మానుషి చిల్లర్.. తన అందచందాలతో 2017లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఇక అదే సంవత్సరం మిస్ వరల్డ్ కిరీటాన్నిసైతం దక్కించుకుని రికార్డు సృష్టించింది. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న 6వ భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పృథ్వీరాజ్ సినిమాలో రాణీ సంయోగిత పాత్రలో నటించింది. ఈ సినిమాలో నటనకు గాను మానుషికి ప్రశంసలు దక్కాయి. దాంతో వరుసగా ఆఫర్లు ఈ సుందరి తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మానుషి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
C’est une jumpsuit, not a dress🙃🙃 pic.twitter.com/DnuEhM4PXY
— Manushi Chhillar (@ManushiChhillar) November 17, 2022
ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించడానికి ఈ అమ్మడు అంగీకరించినట్లు సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రం షూటింగ్ కు వెళ్లనుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ కు జోడీగా మానుషి చిల్లర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా సిద్దం అవుతున్నాడు. జెట్ పైలట్ గా వరుణ్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Filled with gratitude on receiving “Best Debut of The Year” for #SamratPrithviraj at the Lions Gold Awards.✨@lionsclubs @LionRajuVM @PiictureNKraft @nishantbhuse pic.twitter.com/C3qMu3mTd0
— Manushi Chhillar (@ManushiChhillar) October 15, 2022