మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్రమార్కులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఎన్నో సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - May 31, 2023 / 10:53 AM IST

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ పేరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డైరెక్టర్. ప్రజలకు మరింత సేవ చేసేందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని.. ఈ మేరకు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు కూడా వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలో ఆయన పలువురు ప్రముఖులను కలిసి వివాహ శుభలేఖ అందించే పనిలో ఉన్నారు. తాజాగా జేడీ లక్ష్మీనారాయణ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. వివరాల్లోకి వెళితే..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. లక్ష్మా నారాయణ సతీమణి ఉర్మిళతో కలిసి హైదరబాబాద్ జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి, సురేఖ దంపతులను తమ కూతరు ప్రియాంక పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. దీనికి మెగా దంపతులు సానుకూలంగా స్పందించారు.  జేడీ లక్ష్మీనారాయణ కూతరు ప్రియాంక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో  పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ కూడా నడుస్తుంది. కాకపోతే ఈ విషయంపై జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ  ఇప్పటికే రాజకీయాల్లో తనదైన ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి సుమారుగా మూడు లక్షల ఓట్లతో మూడో స్థానం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవిని జేడీ లక్ష్మీనారాయణ దంపతులు కలిసిన ఆహ్వానిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed