సమీరా రెడ్డి.. ఈ మాజీ హీరోయిన్ ను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేసినా టాలీవుడ్ లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. హిందీ, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలోనూ లక్ కలిసిరాక సినిమాలకు దూరంగా కుటుంబంతో ఆనందంగా గడుపుతోంది. వాళ్లతో దిగిన ఫొటోలు, వెకేషన్స్ గురించి ఫ్యాన్స్ కు అప్ డేట్ ఇస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, హీరోయిన్ల మీద ట్రోలింగ్ సర్వసాధారణం. వాళ్లు పెట్టే ఫొటోలకు నెటిజన్లు ఒక్కోసారి భిన్నంగా స్పందింస్తుంటారు. అలాంటి సమయాల్లో కొందరు మనకెందుకులే అని వదిలేస్తుంటారు. కానీ, సమీరా రెడ్డి అలా వదలకుండా ట్రోలర్స్ స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ ఉంటుంది. గతంలో తన తెల్లజుట్టుపై ఘాటుగానే స్పందించింది.
తాజాగా మరోసారి తన లుక్స్ విషయంలో వచ్చే ట్రోలింగ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. షాట్స్ లో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ సమీరారెడ్డి ఈ వ్యాఖ్లు చేసింది. ” నా బాడీ అంటే నాకు ఎంతో ఇష్టం. నా శరీరాన్ని నేను అమితంగా ప్రేమిస్తాను. నా లుక్స్ గురించి ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించుకుంటూ చాలా టైమ్ వేస్ట్ చేశాను. నేను కెమెరా ముందు బాగానే ఉన్నాను. నాకు ఎంతో కంఫర్ట్ గా ఉంది. శరీరాల్లో మార్పులు వస్తుంటాయ్.. మీ శరీరాన్ని మీరు ఎక్కువ కష్టపెట్టకండి. అవతలి వాళ్లు మీపై పెట్టుకునే ఎక్స్ పెక్టేషన్స్ గురించి ఆలోచించకండి” అంటూ సమీరా రెడ్డి రాసుకొచ్చింది.