నరేష్, పవిత్ర లోకేశ్ లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా వీరి గురించి వార్తలే. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి. తాము పెళ్లి చేసుకున్నామనే అర్థం వచ్చేలా నరేష్ చేసిన ట్వీట్ పెను సంచలనం అయిన సంగతి విదితమే. అనంతరం వీరిద్దరూ హనీమూన్‌కు వెళ్లారంటూ ఓ వీడియో హల్ చల్ చేసింది. తాజాగా..
టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట నరేష్, పవిత్ర లోకేశ్. కొన్ని రోజులుగా వీరు సెంటరాఫ్ అట్రాక్షన్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా వీరి వార్తలే. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి. కొన్నేళ్ల నుండి సహజీవనంలో ఉన్న ఈ జంట విషయంలో దుమారం రేగుతున్న సమయంలో సడన్‌గా లిప్ లాక్ వీడియోతో ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేశారు. అనంతరం మళ్లీ పెళ్లి అనే సినిమాను ప్రకటించారు. అయితే తాము పెళ్లి చేసుకున్నామనే అర్థం వచ్చేలా నరేష్ చేసిన ట్వీట్ పెను సంచలనం అయిన సంగతి విదితమే. అనంతరం వీరిద్దరూ హనీమూన్‌కు వెళ్లారంటూ ఓ వీడియో హల్ చల్ చేసింది.
మళ్లీ పెళ్లి సినిమా టీజర్ విడుదల చేయడంతో.. అదంతా సినిమా ప్రమోషన్‌లో భాగమని తేలిపోయింది. తన నిజ జీవిత సంఘటనలతో ఈ సినిమాను చిత్రీకరించినట్లు ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ మాట్లాడుతూ తన నిజ జీవిత గాథ కాదని, అందరికీ కనెక్ట్ అయ్యే కథ అంటూ చెప్పారు. ఒక వ్యక్తిపై రివెంజ్ తీర్చుకోవడానికే ఈ సినిమా తీశారు అంటున్నారని, సినిమా తీసి రివెంజ్ తీర్చుకునే అంత డబ్బులు లేవంటూ చమత్కరించారు. సినిమా చూసాక కూడా మీకు సందేహాలు ఉంటే సమాధానమిస్తానన్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్ననరేష్.. మూడో భార్య రమ్యతో గొడవలు జరుగుతున్న సంగతి విదితమే. ఆమెకు ఇంకా విడాకులు ఇవ్వలేదు. అయినప్పటికీ పవిత్ర లోకేశ్‌తో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనే విషయంపై ఆయన కూడా క్లారిటీ లేదు. కానీ ఇప్పడు ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన మంచి శకునములే అని సినిమాలో నటిస్తున్నారు. మే 18న విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుంది. సంతోష్ శోభన్, మాళవిక జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. అయితే ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. పవిత్రనుద్దేశించి కొన్ని ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. ఈ షూటింగ్ సమయంలో పవిత్ర భోజనం వండి తీసుకు వచ్చేదని అన్నారు. అలాగే ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు క్లిక్ మనగా.. నరేష్ ఫోన్‌పై చూపు పడింది. అందులో డిసీ ప్లే ఆన్ అవ్వగా.. వాల్ పేపర్‌గా నరేష్, పవిత్ర ఫోటో కనిపించింది. వారిద్దరి ఫోటోనే ఆయన ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నారు. వీరిద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో అంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే మీమర్స్ వెంటనే ఈ ఫోటోపై ఫోకస్ పెట్టి తమదైన రూపంలో మీమ్స్ తయారు చేస్తున్నారు.