పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'హరిహర..' సెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఇంతకీ అసలేం జరిగింది?
పవన్ కల్యాణ్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘బ్రో’ షూటింగ్ పూర్తి చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘OG’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటితోపాటు ఎప్పటినుంచో సెట్స్ పై ఉన్న ‘హరిహర వీరమల్లు’ కూడా పెండింగ్ లో ఉంది. అన్నీ కుదిరి మరి కొన్నిరోజుల్లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. సరిగ్గా ఇలాంటి టైంలో అనుకోనిది జరిగింది. చెప్పాలంటే ‘హరిహర..’ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు విషయానికొచ్చేస్తే.. పవన్ చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్పుడెప్పుడో మొదలైంది. కానీ రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఆగిఆగి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా పవన్ డేట్స్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ ప్రాంతంలో సెట్ వేశాడు. అయితే కొన్నిరోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఆ సెట్ పాక్షికంగా పాడైంది. ఇప్పుడు దాన్ని బాగు చేస్తూ మొత్తానికి రెడీ చే సేశారు. కానీ ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సెట్ దగ్గరకు చేరుకుని మంటలను అయితే ఆర్పేశారు. కానీ సెట్ బాగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది అనేది మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొగల్ కాలం నాటి స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో పవన్.. ఓ వజ్రాల దొంగగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతమందిస్తున్నారు. అసలే లేట్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఈ ప్రమాదం మరింత ఆలస్యమయ్యేలా చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ‘హరిహర..’ సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.