చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలపై పలు రకాలుగా ఆరోపణలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపించే ఆరోపణలు లైంగిక ఆరోపణలు. తాజాగా ఇలాంటి ఆరోపణలతోనే ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై కేసు నమోదు అయ్యింది. సింగర్ తనపై అత్యాచారం చేశాడని ఓ కాస్ట్యూమ్ డిజైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాహుల్ జైన్.. ప్రముఖ బాలీవుడ్ సింగర్. తన హుషారైన పాటలతో కుర్రకారును పిచ్చెకిస్తాడు. అయితే రాహుల్ తనపై అత్యాచారం చేశాడని ఓ కాస్ట్యూమ్ డిజైనర్ పోలీసులను ఆశ్రయించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాస్ట్యూమ్ డిజైనర్ పని నచ్చడంతో ఆమెను రాహుల్ ప్రశంసిస్తూ ఇన్ స్టా గ్రామ్ లో మెసేజ్ చేశాడని, అలాగే తనకు పని ఇప్పిస్తానని రమ్మని చెప్పాడు. దాంతో ఆమె అతని ప్లాట్ వెళ్లింది. అప్పుడే తనపై రాహుల్ అత్యాచారం చేశాడు. అతడికి సంబంధించిన ఆధారాలన్నింటిని అతడు ఫొన్ నుంచి తొలగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో ఆమె ఫిర్యాదు మేరకు రాహుల్ పై 376, 323, 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సింగర్ రాహుల్ బాధిత మహిళ ఆరోపణలను ఖండించాడు. ఆమె తనకు తెలిదని, తనను చూడడం ఇదే మెుదటి సారి అని తెలిపాడు. గతంలో కూడా తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తు చేశాడు రాహుల్. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు మెుదలు పెట్టారు. మరి సింగర్ పై అత్యాచార ఆరోపణలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Maharashtra | A rape case is registered against singer Rahul Jain. A 30-year-old woman lodged a complaint against him at Oshiwara PS in Mumbai. A case has been registered u/s 376,323,506 & 504 of IPC & started further investigation. No arrest has been made yet: Oshiwara Police
— ANI (@ANI) August 15, 2022