మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాన్ సినీ ఇండస్ట్రీ, ఏపి రాజకీయాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మద్య సినీ ఇండస్ట్రీపై రాజకీయ పెత్తనాలు మొదలయ్యాయని.. ఎవరి ముందు తలదించుకొని ఉండాల్సిన ఖర్మ లేదని.. తన ఒక్కడి కోసం తెలుగు ఇండస్ట్రీని బాధపెట్టవొద్దంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ గా మాట్లాడారు. దాంతో ఇటు ఇండస్ట్రీ.. అటు ఏపి రాజకీయాల్లో అగ్గి రాజుకుంది.
ఈ క్రమంలో మంత్రి పేర్ని నానితో నిర్మాతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ అనేది సున్నతమైన విషయం అని.. దాన్ని రాజకీయాల్లోకి లాగవొద్దని పలువురు నిర్మాతలు అన్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ ని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి. ఇదిలా ఉంటే.. పవన్‌తో వీరంతా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ చేసిన వ్యాఖ్యలకు సినీ పరిశ్రమతో సంబంధం లేదని ఇటీవలే నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.