సినిమా ఇండస్ట్రీకి 2022 ఎంతో విషాదాన్ని మిగిల్సి వెళ్లింది. గత సంవత్సరంలో టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. దిగ్గజ నటులు పలువురు వెంట వెంటనే కన్నుమూశారు. కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ, చలపతి రావు వంటి వారు చనిపోయారు. ఇక, కొత్త సంవత్సరం మొదటి నెలలోనే ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్య నారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మరణానికి కొన్ని నెలల ముందు నుంచే ఆయన బయటికి రావటం మానేశారు. ఇంటికే పరిమితం అయ్యారు. వీల్ ఛైర్‌లోనే ఉండిపోయారు. మనవరాలి పెళ్లి రిసెప్షన్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన మరణించారు.
సూర్యనారాయణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, సూర్యనారాయణ పలు సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తన సత్య చిత్ర బ్యానర్‌పై అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. 1977లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘అడవి రాముడు’ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. మరి, ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్య నారాయణ మృతిపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
REGRET TO INFORM YOU THAT SENIOR PRODUCER SRI A. SURYANARAYANA GARU (“ADAVI RAMUDU”) PASSED AWAY TODAY (20-01-2023). pic.twitter.com/xknyNQrs26
— Suresh Kondeti (@santoshamsuresh) January 20, 2023